translateexpand_more

Sony Liv News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 11:28 am
ఎయిర్ టెల్ యూజర్లకు బ్రహ్మాండమైన ఆఫర్.. 20 యాప్స్ జస్ట్ రూ. 99కే

Airtel Xstream Play : ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. టెలికం దిగ్గజం సమ్మర్ ఓటీటీ సేల్‌ ప్రవేశపెట్టింది. ఇందులో లిమిటెడ్ టైమ్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు రూ.99కే ఆఫర్ చేస్తోంది. సాధారణంగా ఈ ప్రీమియం ప్లాన్ ధర రూ.149 ఉంటుంది. ఆసక్తిగల యూజర్లు తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. స్ట్రీమింగ్ ఆప్షన్‌లను కూడా పొందవచ్చు. రూ. 99కే ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం ప్లాన్ : కేవలం రూ. 99కే ఎయిర్‌టెల్ ఒకే లాగిన్‌తో 20 విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ప్లాన్ వివరాలు : ధర : రూ. 99 (లిమిటెడ్ టైమ్ ఆఫర్) సాధారణ ధర : రూ. 149 వ్యాలిడిటీ : 1 నెల రోజుకు అయ్యే ఖర్చు : రూ. 3.30 రూ. 99 ప్లాన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో మొత్తం 20 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఇందులో అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. సబ్‌స్క్రైబర్‌లకు షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ యాక్సస్ పొందవచ్చు. Read Also : Gold Deposit Scheme : బాబోయ్.. ఇంట్లో బంగారం ప్రభుత్వానికి ఇచ్చేయాలా? ఎయిర్‌టెల్ రూ. 279 ప్లాన్‌లో అన్ని ఓటీటీ ఒకే ప్యాక్‌లో లభిస్తాయి. ఒకవేళ మీకు నెట్‌ఫ్లిక్స్ లేదా జియోహాట్‌స్టార్ వంటి ప్రీమియం, పాపులర్ పొందిన ఓటీటీలు అవసరమైతే.. వారికోసం ఎయిర్‌టెల్ నెలకు రూ. 279 కే ‘ఆల్ ఓటీటీ ఇన్ వన్ ప్యాక్’ను ప్రారంభించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ బండిల్ వివరాలు ఇలా ఉన్నాయి. ధర : రూ. 279 వ్యాలిడిటీ : ఒక నెల డేటా బెనిఫిట్ : 1GB డేటా పోస్ట్ డేటా ఛార్జీలు : ప్రతి MBకి 50 పైసలు అదనంగా 20 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. ఈ కాంబో అన్నింటినీ సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌లో పొందవచ్చు. అర్హులైన యూజర్లకు సబ్సిడీతో అనేక ప్లాన్లు లభిస్తున్నాయి. ఎయిర్‌టెల్ రూ.99 ప్లాన్, రూ.279 బండిల్‌ అన్ని మెయిన్ ప్లాట్‌ఫారమ్‌లు ఒకే దగ్గర పొందవచ్చు.

Sony Liv News Keyword | Telugu Digital