
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coastal Railway Zone) కార్యకలాపాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దీంతో భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం చేరింది. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్.. కొత్త జోన్‌లో చేరుతున్న అధికారులకు, సిబ్బందికి సాదర స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమై జోన్ ఎలా పనిచేయాలో వారికి దిశానిర్దేశం చేశారు.పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, కార్యాచరణ ప్రభావాన్ని బలోపేతం చేయడం, ప్రయాణీకుల, సరుకు రవాణా సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా దక్షిణ తీర రైల్వేను ఏర్పాటు చేసినట్లు జీఎం సందీప్ మాథుర్ తెలిపారు. ఈ ప్రాంత వ్యాప్తంగా మౌలిక సదుపాయాల వృద్ధిని వేగవంతం చేయడంలో, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో ఈ కొత్త జోన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడిన జోన్ యొక్క అధికార పరిధిని, నెట్‌వర్క్‌ను ప్రదర్శిస్తూ, దక్షిణ తీర రైల్వే వ్యవస్థ పటాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు.రైల్వే భద్రత యొక్క అత్యంత ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ.. జీఎం సమగ్ర భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కొత్త జోన్‌లో భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యాచరణ పనితీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమైనప్పటికీ, రైల్వే కార్యకలాపాలలోని ప్రతి అంశంలోనూ భద్రతే మార్గదర్శక సూత్రంగా కొనసాగాలని ఆయన తెలిపారు. కొత్త జోన్‌తో విలీనం అవుతున్న డివిజన్లపై డివిజనల్ రైల్వే మేనేజర్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, పరిష్కరించాల్సిన సవాళ్లు మొదలైన అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ సమీక్షా సమావేశానికి విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా, విశాఖపట్నం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, గుంటూరు డివిజన్ డివిజనల్