translateexpand_more

Southern Railway News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne03 Jun, 12:40 pm
అరుణాచలం భక్తులకు రైల్వే శాఖ శుభవార్త

అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా కొలువై ఉన్న శివుడ్ని దర్శించుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. తమిళనాఢులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తిరువణ్ణమలై అంటారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. 07001 నంబర్ చర్లపల్లి-తిరువణ్ణామలై ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ఈ నెల 4 నుంచి సెప్టెంబరు 24వ తేదీ వరకు చర్లపల్లిలో సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. అదేవిధంగా మరో మార్గంలో 07002 నంబర్ తిరువణ్ణామలై-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ వరకు తిరువణ్ణామలైలో రాత్రి 11.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్‌ మీదుగా తిరువణ్ణామలై చేరుకుంటాయి. ఈ రైళ్ల రిజర్వేషన్‌ బుధవారం నుంచి ప్రారంభమైందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది. కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం శ్రీవారి లడ్డుల విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌