
Sridevi: శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే..
దివంగత హీరోయిన్ శ్రీదేవి ఫ్యామిలీ విషయాలు, ఆస్తుల వివాదం కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న స్థలం గురించి దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
