translateexpand_more

Story Of A Nightie News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu03 Jun, 05:20 am
ప్రతి ఇంట్లో కనిపించే నైటీ కథ ఇదే.. మనదేశంలో ఎప్పుడు ఎలా మొదలైందంటే

భారతదేశంలో ఇప్పుడు మహిళల రోజువారీ జీవితంలో నైటీ ఒక ముఖ్యమైన డ్రెస్‌గా మారిపోయింది. ఇళ్లల్లో పనులు చేసుకునేందుకు, నిద్రపోయేటప్పుడు నైటీ చాలా కంఫర్ట్ గా ఉంటోందని మహిళల అభిప్రాయం. అందుకే కోట్లాదిమంది మహిళలకు నైటీలు ఫేవరేట్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు భారతదేశంలో మహిళలకు నైటీలు అంటేనే తెలియదు. అవి వేసుకునే అలవాటే లేదు. ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో చీరలు, లంగాఓణీలతోనే ఉండేవారు. కానీ ఇప్పుడు నైటీలు మహిళలకు సౌకర్యంగా ఉండే దుస్తుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. అసలు నైటీలు మనం దేశానికి ఎలా వచ్చాయి? మన సంస్కృతిలో ఎలా భాగం అయ్యాయి? నైటీ అనే డ్రెస్ మూలాలు పాశ్చాత్య దేశాల్లోని నైట్ గౌన్ సంస్కృతితో అనుబంధం కలిగి ఉన్నాయి. 19వ శతాబ్దం చివర నుంచి యూరోప్ దేశాల్లోని మహిళలు రాత్రి నిద్రపోయే సమయంలో పొడవైన, వదులైన గౌన్లను ధరించేవారు. ఎక్కువగా ధనిక కుటుంబాల్లోని వారే ఇలాంటివి వేసుకొని నిద్రపోయేవారు. రాత్రిపూట ఈ దుస్తులు సౌకర్యంగా ఉంటాయని వారు భావించేవారు. ఇక మన దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యాక వారి దుస్తుల ప్రభావం కూడా మన దేశంపూ పడింది. కానీ ఆ సమయంలో నైటీలు మన మహిళల జీవితంలో భాగం కాలేదు. కేవలం కొన్ని ధనవంతుల కుటుంబాల్లో మాత్రమే కనిపించేవి . భారతదేశనికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా 1970 నుంచి 80 దశకంలో భారతదేశంలోని జీవన శైలిలో ఎన్నో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అలాగే మార్కెట్లో రెడీమేడ్ దుస్తులు అమ్మకాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ సమయంలోనే నైటీలు మెల్లగా మార్కెట్లో అడుగుపెట్టాయి. మొదట వీటిని ఎవరూ పెద్దగా కొనలేదు. వాటిని వేసుకుంటే విచిత్రంగా చూసేవారు. చీరలతోనే రాత్రిపూట నిద్రపోయేవారు. అయితే ఉద్యోగం చేసే మహిళలు, ధనిక కుటుంబాలకు చెందిన మహిళలు మొదటగా నైటీలను వేసుకోవడం మొదలుపెట్టారు. ఇంటి పనులు చేస్తున్నప్పుడు సౌకర్యంగా అనిపించడం వల్ల వారికి ఎంతగానో నచ్చేసాయి. ముఖ్యంగా చవక ధరల్లో దొరకడం ప్రారంభించాయి. అలాగే రాత్రిపూట కూడా ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండడంతో మెల్లగా పట్టణంలో నివసించే మహిళల్లో నైటీ సంస్కృతి పెరిగిపోయింది. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. నైటీని రాత్రి పగలు కూడా వేసుకొని తిరిగేస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు నైటీల మార్కెట్ కోట్ల రూపాయల్లో నడుస్తోంది. రకరకాల రంగులు, డిజైన్లు, పూల ప్రింట్లు, రకరకాల ఫ్యాబ్రిక్ లతో నైటీలు మహిళల మనసు దోచుకుంటున్నాయి. రోజువారీ సౌకర్యానికి గుర్తుగా నైటీలను మహిళలు భావిస్తున్నారు. ఇది ఒకప్పుడు ఇది విదేశీ ప్రభావంతో వచ్చిన దుస్తులే కావచ్చు కానీ ఇప్పుడు భారతీయ కుటుంబాల్లో మాత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

Story Of A Nightie News Keyword | Telugu Digital