‘మాఘ మాసం ఎప్పుడొస్తుందో... మౌన రాగాలెన్నినాళ్లో..’ ‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ దశాబ్దాలు గడిచినా ఆమె పాట ప్రతి నోట సజీవమే. బాణీకి శృతి కలిపినా రాగమే... వేరొకరి పాత్రకు గొంతు పలికినా రాగమే. పాటకు ప్రాణం పల్లవి అయితే... ఆ పల్లవులు ఆమె గాత్రంలో కోయిలను మరిపిస్తాయి. ముప్ఫై ఏళ్లుగా కొనసాగుతున్న గానప్రవాహం... మూడు వేలకు పైగా గీతాలు ఆలపించిన సుమధుర స్వరం... సునీత ఉపద్రష్ట. ప్రస్తుతం విభిన్న థీమ్‌తో ప్రేక్షకులను ప్రత్యక్షంగా అలరించేందుకు సన్నద్ధమవుతున్న సునీతను ‘నవ్య’ పలుకరించింది.

‘టైమ్‌లెస్ విత్ సునీత ఉపద్రష్ట... ప్రస్తుతం నేను తలపెట్టిన కాన్సర్ట్ ఇది. తరచూ వేదికలపై పాటలు పాడుతూనే ఉంటాను కానీ... ఇది వాటికి భిన్నమైనది. దీన్ని ఒక థీమ్ ఆధారిత కార్యక్రమంలా తీర్చిదిద్దాం. ఉదాహరణకు ‘మాయాబజార్’ థీమ్. ఆ తరం నుంచి ఈతరం వరకు... ఒక జ్ఞాపకాల దొంతరలాగా. ఇందులో నేను, సాహితి చాగంటి, శ్రీకృష్ణ, ధనుంజయ్ కలిసి గీతాలాపన చేస్తున్నాం. ఏ పాటలైతే ‘టైమ్‌లెస్’గా మనం భావించామో, అందరం కలిసి పాడుకొంటామో అలాంటి గీతాలు. నేను చిన్నప్పటి నుంచీ ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్స్ రెండుమూడు రోజులకు ఒకసారైనా చూస్తుంటాను. అలాగే నేను పని చేసినవాటిల్లో ‘గోదావరి’ నాకు చాలా ఇష్టం. నాకు మంచి పేరు తెచ్చిన చిత్రం. ఆ సినిమాకు సంబంధించి కూడా ఒక థీమ్ చేస్తున్నాం. జూన్ 13న హైదరాబాద్ శిల్పకళావేదిక లో ‘ఎలెవెన్ పాయింట్ టు, వేదమ్ ఆర్ట్స్’ నిర్వహిస్తున్న ఈ షోలో 150 ఏళ్ల వందేమాతరం థీమ్‌తో పాటు, ఎనిమిది మంది మ్యుజీషియన్స్ వారి వాయిద్యాల ప్రత్యేకతను ప్రదర్శించేలా రూపొందించాం.

<span