
Liam Livingstone IPL Performance: ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడటంతో ఎంతో ఘనంగా ముగిసింది. అయితే ఈ సీజన్ ముగిసిన తరుణంలో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ తీసుకున్న ఒక భారీ నిర్ణయం ఇప్పుడు జట్టుకు గుదిబండగా మారింది. ఒక స్టార్ ఆటగాడి కోసం ఏకంగా రూ. 13 కోట్లు కుమ్మరిస్తే, అతను చేసిన పరుగులు చూసి హైదరాబాద్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కోట్లు కుమ్మరించిన కావ్య మారన్.. మైదానంలో మాత్రం నిరాశే! మెగా వేలంలో ఆటగాళ్లను వ్యూహాత్మకంగా కొనుగోలు చేయడంలో కావ్య మారన్ ఎప్పుడూ ముందుంటారు. ఐపీఎల్ 2026 వేలంలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టును బలోపేతం చేసేందుకు ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్‌ను ఏకంగా రూ. 13 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నారు. మిడిల్ ఆర్డర్‌లో అతడు సిక్సర్ల వర్షం కురిపిస్తాడని యాజమాన్యం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తీరా సీజన్ చూస్తే కథ అడ్డం తిరిగింది. అంతటి భారీ ధర పలికిన ఈ ఇంగ్లీష్ ఆటగాడిపై సన్‌రైజర్స్ యాజమాన్యం కానీ, కెప్టెన్ కానీ కనీస నమ్మకం ఉంచలేకపోయారు. ఇది కూడా చదవండి: ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు రెండే రెండు మ్యాచ్‌లు.. ఒక్కో పరుగు విలువ కోటి రూపాయలు! రూ. 13 కోట్ల ఆటగాడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దించింది. ఆ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి లివింగ్‌స్టన్ చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. అంటే కావ్య మారన్ పెట్టిన పెట్టుబడికి, అతను చేసిన పరుగుల లెక్కకు పోల్చి చూస్తే.. దాదాపు ఒక్కో పరుగుకు కోటి రూపాయలకు పైగానే ఖర్చయిందని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతటి పేరున్నప్పటికీ, ఐపీఎల్ వేదికపై మాత్రం అతను ఘోరంగా విఫలమయ్యాడు. గత సీజన్లలోనూ అదే ఫ్లాప్ షో.. లివింగ్‌స్టన్ గతంలో ఆర్‌సీబీ తరపున ఆడినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రూ. 8.75 కోట్ల ధరకు ఆడిన ఆ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ తరపున 2022లో 437 పరుగులు చేసి మెరిసినప్పటికీ, ఆ తర్వాత 2024 సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 111 పరుగులకే పరిమితమయ్యాడు. వరుసగా విఫలమవుతున్నా అతనిపై నమ్మకంతో కావ్య మారన్ అంత భారీ మొత్తం వెచ్చించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఇది కూడా చదవండి: బీసీసీఐ డేంజరస్ నిర్ణయం.. ఆ జోడీతో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్.. ఇకపై టార్గెట్ పవర్ ప్లేలోనే ఫినిష్..! సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఉద్వాసన తప్పదా? వరుస సీజన్లలో పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న లియామ్ లివింగ్‌స్టన్‌ను జట్టులో కొనసాగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంచ్‌కే పరిమితమై, వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న ఈ ఆటగాడిని వచ్చే సీజన్ కంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీ వదిలించుకునే (రిలీజ్ చేసే) అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూ. 13 కోట్లు ఆదా చేసుకుని, వచ్చే వేలంలో మరో మంచి దేశీ లేదా విదేశీ ఆటగాడిని జట్టులోకి తెచ్చుకోవాలని కావ్య మారన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: లక్ అంటే వీళ్లదే భయ్యా.. ఒక్క మ్యాచ్ ఆడకుండా అకౌంట్‌లోకి కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే అవాక్కే..! క్రికెట్ చరిత్రలో ఆటగాళ్ల ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ కోట్ల రూపాయల ధర పలికే ఆటగాళ్లు కనీస ప్రదర్శన చేయనప్పుడు ఆ ప్రభావం జట్టు విజయావకాశాలపై తీవ్రంగా పడుతుంది. కావ్య మారన్ నమ్మకాన్ని వమ్ము చేసిన లివింగ్‌స్టన్ ప్రయాణం సన్‌రైజర్స్‌తో ముగిసినట్లేనని క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..