translateexpand_more

Suryakumar Yadav News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 03:48 pm
సూర్యకుమార్ పై వేటు.. టీమిండియా టీ20 సారథిగా ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్

ఐపీఎల్ 2026 ముగిసింది. టీమిండియా జూన్ 6 నుంచి అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆపై వన్డే సిరీస్ కూడా జరగనుంది. అఫ్ఘాన్‌తో సిరీస్‌ల తర్వాత టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లనుంది. అయితే ఇప్పటికే టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. అఫ్ఘాన్‌తో సిరీస్‌కు సైతం అతడే సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.కానీ టీ20 జట్టు విషయానికి వస్తే.. పరిస్థితి వేరుగా ఉంది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ .. ప్రస్తుతం ఫామ్‌లో లేడు. దానికి తోడు వయసు పెరగడం కూడా.. అతడిపై కెప్టెన్సీ వేటు పడేందుకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి జట్టును సెట్ చేసుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 35 ఏళ్ల సూర్యకుమార్‌కు బదులుగా కొత్త కెప్టెన్‌ను నియమించాలని భావిస్తోంది.భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్ , సంజూ శాంసన్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల పేరు వినిపిస్తోంది. అయితే వీరందరిలోనూ శ్రేయస్ అయ్యర్‌వైపే.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ సామర్థ్యం, ఇటీవల అతడి ప్రదర్శన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే అతడిని వన్డే జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా అయ్యర్.. ప్రమోషన్ పొందుతాడనే తెలుస్తోంది.శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించడంతో పాటు.. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకూ తీసుకెళ్లాడు. పరిస్థితులకు తగ్గట్లు వేగంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉండటం కూడా అయ్యర్‌కు కలిసొస్తుందని చెప్పొచ్చు. దీంతో మిగతా వారితో పోలిస్తే.. అతడు కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో అతడు 13 ఇన్నింగ్స్‌లలో 498 పరుగులు స్కోరు చేశాడు. సుమారు 170 స్ట్రైక్‌ రేట్‌తో అతడు ఈ రన్స్ సాధించడం గమనార్హం.

Suryakumar Yadav News Keyword | Telugu Digital