
హైదరాబాద్‌లో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 3: నగరంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఈరోజు(బుధవారం) ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉండి అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్‌కు వెళ్లి ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నారు. పోలీస్ శాఖలో పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే అభియోగం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఢీ జోడి డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తురాలి మృతి