translateexpand_more

Tamasnna Bhatia News News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 06:10 am
ఏం సినిమా రా బాబూ.. ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. చూస్తే వదలరు

గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతోంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటూ నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఈ క్రమంలో ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని 'బురారీ డెత్స్' యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. అసలు అది సామూహిక ఆత్మహత్యా? లేక ప్రణాళికాబద్ధమైన హత్యలా? అనే కోణంలో కథ సాగుతుంది. ఈ కేసును ఛేదించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ 'అన్యా' పాత్రలో తమన్నా కనిపించారు. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే తమన్నా, ఈ సిరీస్‌లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మేకప్ లేకుండా చాలా సహజంగా నటించారు. ఇందులో ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు రాబీ గ్రేవాల్ ఈ సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మలిచారు. ప్రతి ఎపిసోడ్ చివరలో వచ్చే ట్విస్ట్‌లు వీక్షకులలో తదుపరి ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచుతాయి. తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా వంటి నటీనటులు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నటన భయాన్ని కలిగిస్తుంది. ఆఖ్రీ సచ్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు. మానసిక స్థితిగతులు, మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయనే సామాజిక కోణాన్ని కూడా ఇందులో చూపించారు. నేపథ్య సంగీతం (BGM) విజువల్స్ సిరీస్‌లోని సీరియస్‌నెస్‌ను, ఇంటెన్సిటీని మరింత పెంచాయి. మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ జోనర్లను ఇష్టపడే వారికి ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. ప్రస్తుతం ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే వారు వీకెండ్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి. తమన్నా భాటియా.. దక్షిణ భారత చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా రంగంలో అగ్ర కథానాయికగా రాణిస్తూ, గ్లామర్ పాత్రలతోనే కాకుండా వైవిధ్యమైన నటనతోనూ మెప్పిస్తోంది. తమన్నా 15 సంవత్సరాల చిన్న వయసులోనే 'చాంద్ సా రోషన్ చెహ్రా' (2005) అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. అదే సంవత్సరంలో 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Tamasnna Bhatia News News Keyword | Telugu Digital