translateexpand_more

Telugu Cinema Updates 2026 News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 06:25 am
జూన్ 12న సింగర్ సునీత కొడుకు రెండో సినిమా రిలీజ్

టాలీవుడ్ నేపధ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, ‘తథాస్తు క్రియేషన్స్’ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌ను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్నిర్వహించారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, సీనియర్ నటుడు రఘుబాబు ముఖ్య అతిథులుగా హాజరై అఫీషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ పరిశీలిస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథకు సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో గాయని సునీత మాట్లాడుతూ.. ఆకాష్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, ఇది అతనికి రెండో సినిమా అని తెలిపారు. కొత్త వారైనా దర్శకుడు శివ, నిర్మాత బాలకృష్ణ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశారని, అందరూ ఆదరించాలని కోరారు. ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు భానుచందర్, నిర్మాత సి. కళ్యాణ్, నటుడు రఘుబాబు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు. మైత్రి మూవీస్ బ్యాకింగ్ ఉందంటేనే కంటెంట్‌లో ఎంత దమ్ముందో అర్థమవుతుందని, చిన్న సినిమాగా విడుదలవుతున్న ‘కొత్త మలుపు’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

NTV Telugu01 Jun, 05:11 pm
మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్ టైన్ చేస్తా

దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ "ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది" అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా ఒప్పుకోవడానికి తన మనసులోని ఏకైక బలం అభిమానుల ప్రేమేనన్నారు. "మీ కోసమే ఈ సినిమా చేశాను. మీ ఆనందం కోసం చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికైనా నేను వెనకాడను. మా నాన్నగారి (చిరంజీవి) కొడుకుగా పుట్టడం, కళ్యాణ్ బాబాయ్ (పవన్ కళ్యాణ్) ఇంట్లో పెరగడం వల్ల కష్టపడటం, సినిమాలు చేయడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. బహుశా వేరే పనులేవైనా తెలిసి ఉంటే నేనింత పెద్ద నటుడిని అయ్యేవాడినేమో కాదేమో! నాకు తెలిసింది ఒకే ఒక్కటి.. అదే సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను.. ఇది రాసి పెట్టుకోండి" అంటూ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. రామ్ చరణ్ ఎనర్జీ, సినిమాపై ఆయనకున్న నమ్మకం చూస్తుంటే జూన్ 4న థియేటర్లలో 'పెద్ది' సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది!