translateexpand_more

Tgiic Land Auction News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu28 May, 01:37 pm
హైదరాబాద్ లో ఎకరా రూ.237 కోట్లు.. రికార్డు స్థాయిలో చుక్కలనంటిన భూముల ధరలు

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటు విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు, సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. శివరామచారి తాటికొండ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ న్యూస్ ఛానెల్‌లో కాపీ ఎడిటర్‌గా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ స్పోర్ట్స్ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Andhra Jyothy01 Jun, 01:10 pm
రాయదుర్గం భూములకు భారీ డిమాండ్.. మరోసారి ఆకాశాన్నంటిన ధరలు

హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రెండు విడతల వేలాల ద్వారా టీజీఐఐసీకి దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌: రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల ధర పలికింది. దీంతో ఐటీ కారిడార్‌లో భూములకు ఉన్న భారీ డిమాండ్ మరోసారి స్పష్టమైంది. తాజాగా టీజీఐఐసీ 5.09 ఎకరాల భూమిని వేలానికి పెట్టగా, ఈ వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఐటీ, వాణిజ్య రంగాల విస్తరణతో ఈ ప్రాంతంలో భూముల విలువలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, కేవలం రెండు రోజుల క్రితమే నిర్వహించిన మరో భూముల వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది. ఆ వేలం ద్వారా టీజీఐఐసీకి రూ.1,490 కోట్ల ఆదాయం లభించింది. తాజా వేలం, గత వేలం కలిపి రెండు విడతల్లో టీజీఐఐసీకి దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల కోసం పెట్టుబడిదారులు, సంస్థలు తీవ్ర పోటీ పడుతుండటంతో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అన్నదాతకు అండగా ప్రభుత్వం.. చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి