తిరుమలలో భక్తుల రద్దీ కనిపించింది.. వేసవి సెలవుల కారణంగా కొండకు భక్తులు క్యూకట్టారు. తిరుమల శ్రీవారిని మే నెలలో రికార్డు స్థాయిలో 25లక్షల 46వేల 168 మంది భక్తులు దర్శించుకున్నారు. 2025లో 23,79,252 మంది దర్శించుకుంటే.. 2024 మేనెలలో 23,23,493 మంది దర్శించుకున్నారు. 2024, 2025తో పోలిస్తే 2026 మేలో దాదాపు రెండు లక్షల మందికి అదనంగా దర్శనం చేసుకోవడం విశేషం. మే 24న అత్యధికంగా 98,058 మంది స్వామివారిని దర్శించుకున్నారు. మే నెలలో హుండీల ద్వారా రూ.120.28 కోట్ల ఆదాయం సమకూరింది.. మే 3న అత్యధికంగా రూ.5.06 కోట్ల కానుకలు అందాయి. మే నెలలో 12.19 లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. మే నెలలో భక్తుల రద్దీని గమనించిన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కూడా కుదించారు. మే రెండోవారం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు విడుదల కావడం, వేసవి సెలవుల కారణంగా రద్దీ ఒక్కసారిగా పెరిగింది. టీటీడీ తిరుమల వైకుంఠం క్యూ క్యాంప్లెక్స్‌లోని ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. టీటీడీ చర్యలతో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత నెలలో ఏకంగా ఏడుసార్లు 90వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.టీటీడీకి విరాళందుబాయ్‌కు చెందిన నేహా టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆమె భర్త మనోజ్‌తో కలిసి హైదరాబాద్‌లో విరాళం డీడీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. దంపతుల దాతృత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో భక్తులు సేవా కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలునారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన గరుడవాహన సేవ సోమవారం రాత్రి వైభవోపేతంగా జరిగింది. సర్వాభరణ భూషితుడై, దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో వెలుగొందిన శ్రీ కల్యాణ శ్రీనివాసుడు గరుడునిపై ఆసీనుడై గ్రామ వీధుల్లో విహరించి భక్తజనులను అనుగ్రహించారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి, “గోవిందా… గోవింద” నామస్మరణలతో ఆ ప్రాంతాన్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. గరుడవాహనంపై స్వామివారి విహారం కనులపండువగా సాగి భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించింది.పౌరాణిక సంప్రదాయంలో 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీకగా భావించబడతాడు. గరుడవాహనంపై విహరించే శ్రీమన్నారాయణుడు తన భక్తుల పట్ల ఉన్న అపార కరుణను చాటుతూ, దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి తెలియజేస్తాడు. గరుడుని దర్శించడం ద్వారా సర్వపాపాలు నశించి, జ్ఞానవైరాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
Tirumala 25 Lakhs Devotees Darshan News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu02 Jun, 02:05 am
తిరుమలలో సరికొత్త రికార్డ్.. ఒక్క నెలలో 25.46 లక్షలమంది.. భారీగా హుండీ ఆదాయం