translateexpand_more

Toilet Commode News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 08:22 am
వైజాగ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..బాత్రూమ్ లో భయంకరమైన చప్పుళ్లు..కమోడ్ తెరిచి చూస్తే ఘోరం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Monitor Lizard In Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. సెక్టార్-8లోని ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు హఠాత్తుగా బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. లోపలికి వెళ్లి వెతకగా, వాష్ రూమ్ కమోడ్‌లో ఏదో పెద్ద జీవి కదులుతూ కనిపించింది. తొలుత దాన్ని చూసి కొండచిలువ లేదా పెద్ద పాము అని భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, వెంటనే తలుపు మూసివేసి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. పాము కాదు.. ఉడుము పట్టు! సమాచారం అందుకున్న వెంటనే వందలాది పాములను రెస్క్యూ చేసిన అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడికి చేరుకున్నారు. కమోడ్‌లోకి నిశితంగా పరిశీలించిన ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నది పాము కాదు.. ఒక పెద్ద ఉడుము (Monitor Lizard). సాధారణంగా ఉడుములకు పట్టు ఎక్కువ. ఒకసారి ఎక్కడైనా గట్టిగా పట్టుకుంటే వాటిని విడిపించడం చాలా కష్టం. దాదాపు గంటపాటు చాకచక్యంగా, శ్రమించి ఆ ఉడుముకు ఎలాంటి గాయం కాకుండా కిరణ్ సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆ కుటుంబంతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 'బెంగాల్ మానిటర్ లిజర్డ్' గురించి తెలుసా? మనం సాధారణంగా గ్రామాల్లో, పొలాల గెట్ల వద్ద లేదంటే పెద్ద పెద్ద కొండరాళ్ల మధ్య చూసే ఈ ఉడుమును 'బెంగాల్ మానిటర్ లిజర్డ్' అని పిలుస్తారు. ఇది ప్రకృతి సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చాలా వేగంగా పరిగెత్తగలదు, చెట్లు ఎక్కగలడంతో అద్భుతంగా ఈదగలదు. ఈ ఉడుము ఆహారంగా ఎలుకలు, పురుగులు, చిన్న పాములు, పక్షుల గుడ్లను తీసుకుంటుంది. పంటలను నాశనం చేసే జీవులను తింటూ ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. వేసవి చివర్లో లేదా వర్షాకాలం ప్రారంభంలో ఇవి 10 నుండి 30 గుడ్లు పెడతాయి. ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా చెదపురుగుల గుట్టల్లో లేదా నేలలో గుంతలు తవ్వి గుడ్లను దాచిపెడతాయి. 6 నుండి 9 నెలల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. ఉడుము నాలుక కూడా పాములాగే రెండుగా చీలి ఉండి.. వాసనను పసిగట్టడానికి సహాయపడుతుంది. ప్రమాదం పొంచి ఉందని భావిస్తే ఇది తన బలమైన తోకతో దాడి చేయగలదు. ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు, కానీ రెచ్చగొడితే మాత్రం ప్రమాదకరంగా మారుతాయి. ఉడుమును చంపితే జైలు శిక్షే! అనేక అపోహల కారణంగా చాలామంది ఉడుములను చంపుతుంటారు, కానీ వన్యప్రాణుల రక్షణలో ఇవి చాలా కీలకం. భారత ప్రభుత్వ చట్టంలో 'వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972' ప్రకారం ఉడుములను రక్షిత జంతువుల జాబితాలో చేర్చారు. ఉడుములను వేటాడటం, చంపడం, వాటి గుడ్లను సేకరించడం లేదా మాంసం, చర్మం కోసం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేరం నిరూపితమైతే 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. Also Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని! Also REad: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Toilet Commode News Keyword | Telugu Digital