తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జర్నలిస్టులకు, సినీ క్రియేటర్లు (దర్శకులు, నిర్మాతలకు) మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం ప్రస్తుతం ఒక వ్యక్తి వివాదాస్పద శైలి కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా తన విలక్షణ ప్రవర్తనతో పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి (అలియాస్ దేవి ప్రియ)కి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరోసారి షాకిచ్చింది.గతంలో ఆయనపై విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ టీఎఫ్‌జేఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ లేఖను విడుదల చేసింది. సూర్యనారాయణ మూర్తి జర్నలిజం ముసుగులో వ్యక్తిగత ప్రాబల్యం కోసం కక్ష సాధింపులకు దిగుతున్నారని, అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యవస్థను కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఆయన ప్రవర్తన సరిగ్గా లేదనే కారణంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆయనపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించి, ఆ తర్వాత ఎత్తివేసింది. అయితే తిరిగి చేర్చుకున్నప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోగా, మరింత కక్షతో వ్యవహరించి దర్శకులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి.* తారక్ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఆయన్నుంచి పిలుపు రావడమే ఆలస్యం - ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ దర్శకుల సంఘం నేరుగా రంగంలోకి దిగి TFJA అధ్యక్ష, కార్యదర్శులకు ఒక ఘాటైన లేఖ రాసింది. సదరు జర్నలిస్ట్ వల్ల తమ సంఘం సభ్యులు (దర్శకులు) తీవ్రంగా నష్టపోయారని, అందువల్లఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని దర్శకుల సంఘం డిమాండ్ చేసింది. ఈ లేఖపై దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి ఎన్. సాయి రాజేష్ తదితరులు సంతకాలు చేయడం పరిశ్రమలో అప్పట్లో పెద్ద సంచలనమైంది. దర్శకుల సంఘం, ప్రముఖ నిర్మాతలు మరియు పరిశ్రమలోని ఇతర విభాగాల నుండి వచ్చిన తీవ్రమైన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న TFJA కార్యవర్గ కమిటీ గతంలో (మార్చి నెలలో) ఆయనపై నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులు, చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తాజాగా మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు. వేదుల సూర్యనారాయణ మూర్తిపై గతంలో విధించిన నిషేధాన్ని యథావిధిగా కొనసాగించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. తదుపరి అధికారిక నిర్ణయాలు వెలువడే వరకు ఈ నిషేధం అమలులోనే ఉంటుందని TFJA స్పష్టం చేసింది.* అభిమానానికి పరాకాష్ఠ: దేవుడి గదిలో విజయ్ విగ్రహం.. నిత్య పూజలపై నెటిజన్ల ఫైర్ అసోసియేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు గౌరవించి పూర్తి సహకారం అందించాలని TFJA విజ్ఞప్తి చేసింది. పరిశ్రమలో క్రమశిక్షణను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం, సంస్థ తీసుకునే నిర్ణయాల పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి మార్గదర్శకాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని అసోసియేషన్ పేర్కొంది. జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో టాలీవుడ్‌లో క్రమశిక్షణా చర్యల పర్వం మరింత ఊపందుకుంది.
Tollywood Controversy News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu03 Jun, 03:12 am
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తిపై నిషేధం కొనసాగింపు.. సంచలన నిర్ణయం