
తెలంగాణలో టెట్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. పాఠశాల విద్యాశాఖ టీఎస్ టెట్ జూన్ 2026 పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2026 షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిఫ్ట్ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. పరీక్షలను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల తేదీలతో పాటు ఉత్తీర్ణత ప్రమాణాలను కూడా అధికారులు వెల్లడించారు. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రణాళికలను మరింత మెరుగ్గా రూపొందించుకునే అవకాశం లభించింది. టీఎస్ టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. అనిపిస్తోంది: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి