translateexpand_more

Ttd Darshan News News

Latest updates from Telugu Digital news sources.

Eenadu03 Jun, 07:40 am
మేలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయం

తిరుమల: ఈ ఏడాది మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తితిదే వెల్లడించింది. 2024 మే నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 1.10 కోట్ల లడ్డూలను విక్రయించగా.. ఈసారి సంఖ్య మరింత పెరిగింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేసింది. లడ్డూల తయారీకి తితిదే రోజువారీగా 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తోంది. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచే శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఐటీఐ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం ముందుకొచ్చింది.