translateexpand_more

Uday Kotak News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 03:15 am
ముగిసింది.. ఇక బిజినెస్ టైమ్! రూ.7.6 లక్షల కోట్ల గూగుల్ డీల్ పై ఉదయ్ కోటక్ వేక్ అప్

Uday Kotak : గత రెండు నెలలుగా దేశాన్ని ఊపేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పండుగ ముగిసింది. క్రికెట్ వినోదం నుంచి దేశం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ భారతీయ కార్పొరేట్ రంగానికి, వ్యాపారవేత్తలకు ఒక వేక్ అప్ కాల్ అందించారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భవిష్యత్తు టెక్నాలజీ కోసం తీసుకున్న ఒక అసాధారణ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ 'ఇక ఐపీఎల్ హడావిడి ముగిసింది కాబట్టి, భారతదేశం తన అసలైన పని అయిన బిజినెస్ ఆఫ్ బిజినెస్‌పై పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది' అని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. గూగుల్ రూ.7.6 లక్షల కోట్ల ప్లాన్ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల రేసు నడుస్తోంది. ఇందులో ముందంజలో ఉండేందుకు, ఇప్పటికే భారీగా నగదు నిల్వలు కలిగి ఉన్న గూగుల్ సంస్త ఏకంగా 80 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.6 లక్షల కోట్లు) అదనపు నిధులను మార్కెట్ నుంచి సేకరించేందుకు సిద్ధమైంది. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలే భవిష్యత్తు కోసం ఇంత అగ్రెసివ్‌గా అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ కంపెనీలు, వ్యాపారస్థులు ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోతే వెనకబడిపోతాయని ఉదయ్ కోటక్ హెచ్చరించారు. భారత మార్కెట్ పరిమాణాన్ని, గూగుల్ కంపెనీ ఆర్థిక బలంతో పోలిస్తూ ఉదయ్ కోటక్ కీలకమైన గణాంకాలను పంచుకున్నారు. 'మిగులు నిధులు ఉన్న గూగుల్ అదనంగా 80 బిలియన్ డాలర్ల మూలధనాన్ని సమీకరిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ వార్షిక లాభం 160 బిలియన్ డాలర్లు కాగా, గత త్రైమాసికంలో అది 62 బిలియన్ డాలర్లుగా ఉంది. గూగుల్ మార్కెట్ క్యాప్ 4.5 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభాలు, మార్కెట్ క్యాప్‌కు దాదాపు సమానం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెట్టుబడులు పెడ్డాలని ఇది అన్ని కంపెనీలకు ఒక హెచ్చరిక. ఇప్పుడు ఐపీఎల్ ముగిసింది కాబట్టి, భారతదేశం వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది' అని ఉదయ్ కోటక్ సూచించారు.చాలా కంపెనీలు త్రైమాసిక లాభాలు చూసుకుని స్థిమితంగా ఉండిపోతాయి. కానీ గూగుల్ వంటి సంస్థలు వర్ధమానం కంటే భవిష్యత్తు టెక్నాలజీపై భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. భారతీయ కంపెనీలు సైతం రాబోయే తరం టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టాలని ఉదయ్ కోటక్ సూచించారు. ప్రపంచ మార్కెట్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో గూగుల్ లెక్కలు చెబుతున్నాయని, భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదగాలంటే మన ఆలోచనా సరళి, పెట్టుబడుల పరిమాణం సైతం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సూచించారు. క్రికెట్ పండుగ ముగిసిన వేళ, దేశ ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయమని ఉదయం కోటక్ గుర్తు చేశారు. సాంప్రదాయ వ్యాపారాలకే పరిమితం కాకుండా, సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేసినప్పుడే భారత్ అసలైన వ్యాపార సామ్రాజ్యంగా మారుతుందని చెప్పారు.