translateexpand_more

Unemployment News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media01 Jun, 10:43 am
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా లేదా

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతనిపై ఎలాంటి అరెస్ట్ ఆర్డర్ లేకపోవడం గమనార్హం. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. బోస్టన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతను జూన్ లేదా జులై నెలలో ఇండియా వస్తానని ప్రకటించాడు. అయితే ఇండియా రాగానే ఎయిర్‌పోర్టులోనే తనను అరెస్ట్ చేస్తారనే భయంలో అభిజీత్ ఉన్నాడు. ఈ తరుణంలో అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. యువకులను "కాక్రోచెస్" అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించడంతో అభిజీత్ స్పందించాడు. దీనికి రియాక్షన్‌గా మే 16న కాక్రోచ్ జనతా పార్టీని ఒక వ్యంగ్య ఉద్యమంగా మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పార్టీకి కోట్ల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, మెంబర్‌షిప్‌లు వచ్చాయి. నిరుద్యోగం, ఎగ్జామ్ లీక్స్, ఉద్యోగాల సమస్యలపై పోరాడుతుండటంతో దేశంలోని యువతలో ఈ పార్టీ బాగా హిట్ అయింది. దీంతో ప్రభుత్వం ఈ పార్టీపై చర్యలు ప్రారంభించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ భద్రతా కారణాలను చూపుతూ సీజెపి ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను ప్రభుత్వం విత్‌హెల్డ్ చేసింది. ఇదిలా ఉండగా, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, వెబ్‌సైట్ కూడా డౌన్ అయిందని అభిజీత్ ఆరోపిస్తున్నాడు. వీటిని త్వరగా అన్‌బ్లాక్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఫలితంగా ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే అభిజీత్ దీప్కే అరెస్ట్ భయం మొదలైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే తనను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తారని అతను భయపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు