translateexpand_more

Uproar Over Supreme Court Judge Remarks News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne01 Jun, 12:21 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం

దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో, సమాజంలో ప్రశ్నించే హక్కును వాడుకుంటున్న నిరుద్యోగ యువతను, ఆర్టీఐ యాక్టివిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ అంశంపై తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో సాగుతున్న కమ్యూనల్, కుల పోలరైజేషన్ ప్రభావం దురదృష్టవశాత్తూ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదడుపై కూడా పడుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విమర్శకులను అర్బన్ నక్సలైట్లు అని ముద్రవేసిన పాలకులు.. ఇప్పుడు సరికొత్తగా బ్రాండింగ్ చేయడం ప్రారంభించారని, దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణని విశ్లేషించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పిస్తోంది. ఈ హక్కులను కాపాడాల్సిన న్యాయమూర్తి, ప్రశ్నించే వారిని అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం కాదు.. చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు, ఎంబీఏ చదివిన యువకులు డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా స్థిరపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల విద్యా విధానాల, ఉపాధి కల్పన వైఫల్యమే అని