translateexpand_more

Uts App Alternative News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu03 Jun, 12:41 pm
ఐఆర్ సీటీసీ రైల్ వన్.. ట్రైన్ టికెట్లు ఎందులో బుక్ చేయాలి..? ఇందులో చేస్తే వేగంగా

రైళ్లల్లో సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. దూరపు ప్రాంతాలకు జర్నీ చేసేవారు ముందుగా టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణం చేస్తుంటారు. అయితే టికెట్లను బుక్ చేసుకోవాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఐఆర్‌సీటీసీ ఫ్లా్ట్‌ఫామ్. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే దీంతో పాటు టికెట్లను బుక్ చేసుకునేందుకు రైల్వేశాఖ మరో యాప్ కూడా అందుబాటులోకి తెచ్చింది రైల్ వన్ యాప్‌ను రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో సాధారణ టికెట్లు, తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ యాప్, ఫ్లాట్‌ఫ్లామ్ టికెట్లు, సెకండ్ క్లాస్ టికెట్ల కోసం యూటీఎస్ యాప్ వాడేవారు. ఇక ఫిర్యాదుల కోసం రైల్ మదద్ యాప్ ఉండేది. కానీ ఒకే ఫ్లాట్‌ఫామ్‌లో అన్నీ సేవలు అందించేందుకు రైల్ వన్ యాప్ తీసుకొచ్చారు. ఐఆర్‌సీటీసీ, రైల్ వన్ యాప్‌లలో ఏది మంచిది అనేది చూస్తే.. మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. సదూర ప్రాంతాలకు ప్లాన్ చేస్తున్నా లేదా తత్కాల్ టికెట్లను పొందాలన్నా ఐఆర్‌సీటీసీ మంచి ఎంపిక. అదే.. మీరు ఒకే యాప్‌లో రిజర్వుడ్ టికెట్‌తో పాటు అన్‌రిజర్వుడ్, ఫ్లాట్ ఫామ్, ట్రైల్ లైవ్ లొకేషన్, ఫుడ్ ఆర్డర్ వంటి సేవలు పొందాలంటే రైల్ వన్ ఎంచుకోండి. ఈ యాప్‌తో రైలు సేవలకు సంబంధించినవన్నీ ఒకేచోట ఉంటాయి. రైల్ వన్ యాప్ కొత్తగా ప్రారంభించారు. దీంతో తత్కాల్ టికెట్ల బుకింగ్స్ సమయంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పేమెంట్ చేశాక టికెట్ బుక్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కంప్లైంట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఎన్నో దశబ్దాలుగా కొనసాగుతున్న ఐఆర్‌సీటీసీ విశ్వసనీయమైన ఫ్లాట్‌ఫామ్‌గా చెప్పవచ్చు. దీంతో మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే దీనిని ఎంచుకోండి. ఇక సబర్బన్ ట్రైన్, ఫ్లాట్ ఫ్లాట్, జనరల్ టికెట్ల కోసం రైల్ వన్ యాప్ ఉపయోగించడం ఉత్తమం. ఎందుకుంటే సేవలన్నీ ఒకేచోట ఉంటాయి. ప్రయాణికులు ఒక్కొ సేవకు ఒక్కో యాప్ వాడాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకేచోట లభించేలా చేసేందుకు రైల్ వన్ యాప్ కొత్తగా తెచ్చారు. యూటీఎస్ యాప్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు.

Uts App Alternative News Keyword | Telugu Digital