translateexpand_more

Vijay Antony Films News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 01:04 pm
జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ ఆంటోని వంద దేవుళ్లు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vijay Antony:ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో మంచి స్పందనను అందుకున్నాయి. తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ‘వంద దేవుళ్లు’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విడుదల తేదీ పోస్టర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్టర్‌లో విజయ్ ఆంటోని, హీరోయిన్ స్వాసిక సైకిల్‌పై ప్రయాణిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. వారి సాధారణ లుక్, నేపథ్యంలోని వాతావరణం చూస్తే ఈ సినిమా పీరియాడిక్ డ్రామా తరహాలో ఉండబోతుందని అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, మానవ సంబంధాలు ఈ కథలో ముఖ్యాంశాలుగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘వంద దేవుళ్లు’ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయని సమాచారం. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. సాంకేతిక విభాగంలో ఎస్.బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ అందించగా, బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా పనిచేశారు. భాష్య శ్రీ సంభాషణలు రాశారు. ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. Also Read: Telangana Govt: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే! Also Read: Zee Unite8 Sports: క్రీడాభిమానులకు అదిరిపోయే శుభవార్త.. 'యునైట్8 స్పోర్ట్స్' ఛానెల్ ప్రారంభించిన జీ న్యూస్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి