
Vijay Deverakonda: బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న హీరో విజయ్ దేవరకొండ..
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుడి ఆశీస్సులు పొందారు.
© 2026 telugu.digital

హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుడి ఆశీస్సులు పొందారు.

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. గుజరాతీలో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రారంభంలో తక్కువ వసూళ్లు నమోదు చేసినప్పటికీ, అద్భుతమైన మౌత్ టాక్‌తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఆయనను సరైన మార్గంలో ఎలా నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్ర తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చరణ్ కటౌట్ కి కృష్ణుడు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోతుంది అనుకున్నారు. కానీ,అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రను పోషించనున్నాడని సమాచారం.తన కెరీర్లో మాస్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు అనేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పౌరాణిక పాత్ర చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు. కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మోడ్రన్ టచ్‌తో ఉండే ఈ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో విజయ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథనంలో

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్‌పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్‌గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ

రష్మిక సినిమా మైసా పోస్టర్ గురించి విజయ్ దేవరకొండ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వయ్‌లెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇంతకీ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటే.. రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో ఆమె గెటపు చూసి. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 27న థియేటర్లలోకి ‘మైసా’ వస్తోందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉన్న రష్మిక ముఖంపై యుద్ధ గాయాలున్నాయి. ఆమె వెనుక భారీ జన సమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్టర్ని పోస్టు చేస్తూ పై విధంగా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 12 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇటీవలే సెట్స్‌లో ఓ పోరాట సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ చిత్రీకరణను పూర్తి చేస్తారని చిత్రబృందం పేర్కొంది

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్‌గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్‌కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా? ఇదే ఈవెంట్లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం విని అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్‌గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది. విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం! విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న

'అర్జున్ రెడ్డి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రోమాంచకం'. 'మేము ఫేమస్', 'గోదారి గట్టుపైన' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకున్న లవ్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబరు 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'రౌడీ హీరో' విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్రంపై హైప్ భారీగా పెరిగింది. అంతేకాదు, చిత్రబృందం ప్రెస్ మీట్లు, కాలేజ్ ఫెస్ట్ లతో దూసుకెళుతోంది. విజయవాడలోనూ చిత్ర యూనిట్ సందడి చేసింది.ఇదిలా ఉండగా, 'రోమాంచకం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్ర నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్