translateexpand_more

Visa Free Transit News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 06:49 am
మాట నిలబెట్టుకున్న జర్మనీ.. భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు

భారతీయ ప్రయాణికులకు జర్మనీ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే (ట్రాన్సిట్) భారత పౌరులకు అవసరమైన 'షెంజెన్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా (టైప్ A)'ను రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని జర్మన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ వంటి ప్రధాన జర్మన్ విమానాశ్రయాల నుంచి నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే లక్షలాది మంది భారతీయులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.ఈ ఏడాది జనవరి 12, 13 తేదీలలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఈ మినహాయింపుపై తొలిసారిగా ప్రకటన వెలువడింది. ఆ పర్యటనలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జర్మనీ ఫెడరల్ లా గెజెట్ లో జూన్ 2న అధికారిక ప్రకటన జారీ చేసి, జూన్ 3 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు జర్మన్ ఎంబసీ తెలిపింది. "భారత్-జర్మనీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నిర్ణయం అందులో భాగమే" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.జర్మనీ నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. "జర్మనీ ద్వారా విమాన ప్రయాణం చేసే భారతీయ పౌరులకు ట్రాన్సిట్ వీసా అవసరాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర

Visa Free Transit News Keyword | Telugu Digital