
<p>విష్ణు విశాల్ ( Vishnu Vishal), ఐశర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన గట్టా కుస్తీ-2 (Gatta Kusthi 2) తెలుగులో మట్టీ కుస్తీ (Matti Kusthi) జూలై మూడో తేదీన విడుదలకు సిద్ధమైంది. 2022లో తమిళం, తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా తొలి భాగం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. </p><p>దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత యేడాది సెప్టెంబరులో ప్రారంభం కాగా, సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు జరుపుకుంటుంది. </p><p>ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేసిన మేకర్స్ సినిమాను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విష్ణు విశాల్, వేల్స్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కరుణాస్, మునీష్కాంత్, యోగిబాబు, రమ్య కృష్ణ తదితరులు నటించారు.</p><div id="articlebodyAdsDiv"></div><iframe width="100%" height="415" src=" https://www.youtube.com/embed/EXHvG1jLe0k" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen loading="lazy"></iframe>