translateexpand_more

West Asia Tensions News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 03:57 pm
లెబనాన్ పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులను తీవ్రతరం చేయడంతో, అమెరికాతో జరుపుతున్న చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ప్రాథమిక ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న సందేశాల మార్పిడికి బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.లెబనాన్‌లో ఇజ్రాయెల్ నేరాలు కొనసాగిస్తుండటమే తమ నిర్ణయానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. "కాల్పుల విరమణకు లెబనాన్‌పై దాడులు చేయకూడదన్నది కూడా ఒక ముఖ్యమైన ముందస్తు షరతు. కానీ లెబనాన్‌తో సహా అన్ని అంశాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అందుకే మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతున్న చర్చలను, సందేశాల మార్పిడిని ఇరాన్ చర్చల బృందం నిలిపివేస్తుంది" అని తస్నిమ్ నివేదిక పేర్కొంది.ఈ పరిణామంపై అంతకుముందు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ దాడులకు తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, ఏ ఒక్కచోట ఉల్లంఘన జరిగినా, అది అన్నిచోట్లా జరిగినట్టేనని వ్యాఖ్యానించారు. దీని పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అరాఘ్చీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అమెరికాతో చర్చల్లో దేశ ప్రతినిధిగా ఉన్న ఘలీబాఫ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా దిగ్బంధనం విధించడం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రతి చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని

Andhra Jyothy29 May, 12:01 am
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది... ఇరాన్‌ బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో అమెరికా దాడి ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు దుబాయి, మే 28: పశ్చిమాసియాలో మళ్లీ మిలిటరీ ఘర్షణలు మొదలయ్యాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ డ్రోన్‌ స్థావరంపై అమెరికా నేవీ దాడి చేయగా, ఇరాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు సమీపంలో బుధవారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ భూభాగంలో ఉన్న డ్రోన్‌ స్థావరంపై అమెరికా నౌకాదళం దాడి చేసింది. తమ నౌకలపై ఇరాన్‌ నాలుగు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిందని అమెరికా మి లిటరీ సెంట్రల్‌ కమాండ్‌ గురువారం ఆరోపించింది. వాటిని మధ్యలోనే కూల్చేశామని, ఐదో డ్రోన్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతుండగా ఆ లాంచ్‌పాడ్‌పై దాడి చేసి ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. గురువారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ దాడులు జరిగాయి. అయి తే, ఏ దేశంలోని బేస్‌పై దాడి చేశారన్న విషయం వెల్లడించలేదు. కానీ, తమపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగాయని అమెరికా మిత్రదేశం కువైట్‌ ప్రకటించింది. ఈ పరస్పర దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఆయా దేశాలు వెల్లడించలేదు. అమెరికా దాడులను ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘీ ఖండించారు. శత్రుదాడుల నుంచి తమ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను