translateexpand_more

Yogi Adityanath News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 01:45 pm
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

లక్నో: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు. గోమాత ఎప్పుడూ దేశానికి తల్లిగానే ఉంటూ వచ్చిందని, జాతీయ హోదా చెల్లుబాటును లాంఛనంగా ప్రకటించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.

'ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు మౌలానాలు డిమాండ్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. గోవు ఇప్పటికే మన తల్లి. ఆవులతో మనబంధం ఈనాటిది కాదు. కాలానికి అతీతమైన అనుబంధం ఇది. తల్లీ, పిల్లల మధ్య అనుబంధాన్ని కొత్తగా నిర్వచించడం, లాంఛనపూర్వక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు' అని బిజ్నోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి పేర్కొన్నారు.

'ఒకవైపు మీరు (ముస్లిం మౌల్వీలు) పశువధను ప్రోత్సహిస్తూ, మరోవైపు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని డిమాండ్ చేస్తున్నారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు అద్దంపడుతోంది' అని యోగి ఘాటుగా విమర్శించారు. పశువధకు పాల్పడే వారిని తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, పశువధ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో భవిష్యత్ తరాలకు కూడా అర్ధమయ్యేలా చేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్

అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం

Andhra Jyothy01 Jun, 01:43 pm
స్నేహం పేరు చెప్పి తప్పించుకోలేరు.. టీనేజర్ హత్యపై యూపీ సీఎం వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఇటీవల కలకలం రేపిన సూర్య అనే టీనేజర్ హత్యపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బిజ్నోర్‌లో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ స్నేహం మాటున హింసాత్మక చర్యలకు దిగితే సహించేది లేదని అన్నారు. తప్పుడు మార్గాల్లో వెళుతున్న పిల్లలను సక్రమమార్గంలో మళ్లించలేని తల్లిదండ్రులు పెద్ద తప్పు చేస్తున్నట్టేనని హెచ్చరించారు. చట్టప్రకారం నడుచుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

అహింస, మానవత్వం సమాజాన్ని సుసంపన్నం చేసే ఆభరణాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగినప్పుడు దీటుగా స్పందించక తప్పదని కూడా చెప్పారు. ఖరదూషనాదులు వంటి రాక్షస శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఆయుధాల చేతపట్టకతప్పదని చెప్పారు. దేశంలోని వారందరూ చట్టానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.

బక్రీద్ రోజున సూర్య (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. బైక్ నడిపే విషయంలో తగాదా తలెత్తడంతో స్నేహితులే అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. మిగిలిన వారిని పోలీసులు అంతకుముందే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్

యూఎస్‌తో ట్రేడ్ డీల్.. 99 శాతం చర్చలు పూర్తి: మంత్రి పీయూష్ గోయల్

AP7AM30 May, 01:06 pm
దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో నిర్వహించిన ‘నౌసేన శౌర్య వాటిక’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ... అహింస మానవాళికి పరమ ధర్మమే అయినప్పటికీ, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారినప్పుడు కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే బలప్రయోగం లేదా ‘ధర్మ హింస’ చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. బలహీనులను ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహాన్ని కోరుకుంటాయని యోగి పేర్కొన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ.. 2017కు ముందు యూపీలో మాఫియా ఆధిపత్యం, నేరాలు ఎక్కువగా ఉండేవని, బీజేపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా మెరుగయ్యాయని గుర్తుచేశారు. దేశ సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశాన్ని కాపాడుతున్న సైనికుల త్యాగాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.

Sakshi29 May, 04:00 am
ఈదురుగాలులకు కూలిన బ్రిడ్జి.. ఆరుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. హమీర్‌పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్‌లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు (ఫోటోలు) అధికారంతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే