translateexpand_more

Telugu Rajyam News

Latest updates from Telugu Digital news sources.

Telugu Rajyam13 Jul, 01:49 pm
మాక్ డ్రిల్.. ఈ తమిళ అమ్మాయిని బలితీసుకుంది వీడియో

Home » మాక్ డ్రిల్.. ఈ తమిళ అమ్మాయిని బలితీసుకుంది (వీడియో) తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో విషాదం జరిగింది. కళైమగల్ కళాశాలలో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ లో అపశృతి చోటు చేసుకుని 19 ఏళ్ల విద్యార్థిని లోగేశ్వరి చనిపోయింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా ప్రాణాలను రక్షించుకోవాలన్న దానిపై ఎన్‌డీఎంఏ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్న లోగేశ్వరి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాల్సి వచ్చింది. కింద విద్యార్థులు వల పట్టుకున్నప్పటికి ట్రైనర్ వెనుక నుంచి నెట్టివేయడంతో లోగేశ్వరి తల ఫస్టు ప్లోరులో ఉన్న దిమ్మకు తగిలడంతో ఆమెకు తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో విద్యార్థిని చనిపోయింది. ఈ ఘటనపై స్పందించిన ఎన్‌ఎండీఏ అధికారులు మేము ఏ కాలేజిలో మాక్ డ్రిల్ నిర్వహించలేదని, మాక్ డ్రిల్ నిర్వహించిన ఆర్ముగానికి తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. సరైన వివరాలు తీసుకోకుండా మాక్ డ్రిల్ నిర్వహించి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Rajyam09 Jul, 02:29 pm
వీడసలు తండ్రేనా? వీడియో

హైదరాబాద్ జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో దారుణం జరిగింది. కన్నతండ్రే కొడుకు పాలిట రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. భార్య భర్తల మధ్య గొడవతో ఉన్మాదిగా మారిన శివ అనే వ్యక్తి తొమ్మిది నెలల కొడుకును ఆటోకేసి కొట్టి పైశాచికత్వం ప్రదర్శించాడు. శివకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్య నిలదీయగా ఆగ్రహాంతో కొడుకును నేలకు, ఆటోకేసి కొట్టి సైకోలా ప్రవర్తించాడు. బాలుడు స్వల్ప గాయాలతో బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుని పట్ల తండ్రి రాక్షసంగా వ్యవహరించిన వీడియో చూసి అంతా అయ్యో అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Rajyam09 Jul, 02:37 pm
కరీంనగర్ లో తప్పిన ప్రమాదం వైరల్ అవుతున్న వీడియో

Home » కరీంనగర్‌లో తప్పిన ప్రమాదం ( వైరల్ అవుతున్న వీడియో) కరీంనగర్‌లో పెనుప్రమాదం తప్పింది. హైవేపై అతి వేగంగా దూసుకొచ్చిన మినీట్రక్కు వ్యాను కారును ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో కారులో, ట్రక్కులో ప్రయాణిస్తున్న వారంతా బతుకు జీవుడా అంటూ బయట పడ్డారు. కానీ ప్రమాదం తప్పిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన తీరును అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రొఫెషనల్ గా ఉండడంతో చూసినవారందరూ ఔరా అంటున్నారు. తెగ షేర్ చేస్తున్నారు. కింద వీడియో ఉంది.

Telugu Rajyam04 Jul, 10:46 am
వైరల్ అయిన తెలంగాణ క్రిష్ణవేణి కవిత వీడియో

Home » వైరల్ అయిన తెలంగాణ క్రిష్ణవేణి కవిత (వీడియో) కవి సమ్మేళనంలో భాగంగా తెలంగాణ కవయిత్రి క్రిష్ణవేణి చదివి వినిపించిన ఒక కవిత ప్రస్తుతం వైరల్ అయింది. గత కొద్ది నెలలుగా ఆమె వీడియోను నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు. సమాజాన్ని ఆలోచింపజేసేవిధంగా ఉన్న కవిత జనాలను హత్తుకుంది. అందుకే తెగ షేర్ చేస్తున్నారు. ఆమె కవిత చదివిన సందర్భంగా తీసిన వీడియో కింద ఉంది మీరూ చూడండి.

Telugu Rajyam29 Jun, 10:54 am
గజ్వేల్ లో రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం వీడియో

Home » గజ్వేల్ లో రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం (వీడియో) తెలంగాణలో రేషన్ డీలర్ల ఆందోళన అదుపుతప్పుతోంది. ఒకవైపు సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లపై సర్కారు వేటు వేసేందుకు ప్లాన్ చేస్తుంటే మరోవైపు రేషన్ డీలర్లు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయితే రేషన్ డీలర్ల ఆందోళన అదుపు తప్పుతోంది. కేసిఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఒక రేషన్ డీలర్ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు గజ్వేల్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేషన్ డీలర్ల ధర్నా, రాస్తారోకో జరుగుతుండగానే.. వజీర్ ఖాన్ అనే డీలర్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం తాలూకు వీడియో కింద ఉంది చూడండి.