
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) 'యునైట్8 స్పోర్ట్స్' పేరుతో 4 కొత్త స్పోర్ట్స్ ఛానెల్‌లను ప్రారంభించింది. జూన్ 11 నుండి ప్రారంభమయ్యే ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, క్రికెట్ మరియు కబడ్డీలను ఈ ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఛానెల్‌లు జూన్ సన్ డైరెక్ట్ మరియు టాటా ప్లేతో సహా 500కు పైగా కేబుల్ మరియు డిటిహెచ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Unite8 Sports channel launch: క్రీడాభిమానులకు బంపర్ న్యూస్. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) 'యునైట్8 స్పోర్ట్స్' పేరుతో 4 కొత్త స్పోర్ట్స్ ఛానెళ్లను ప్రారంభించింది. అవేంటంటే.. యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి, యునైట్8 స్పోర్ట్స్ 2 మరియు యునైట్8 స్పోర్ట్స్ 2 HD. ఈ ఛానెళ్లు జూన్ 2 సన్ డైరెక్ట్ మరియు టాటా ప్లేతో సహా 500కు పైగా కేబుల్ మరియు డిటిహెచ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. జూన్ 11 నుండి ప్రారంభమయ్యే ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, క్రికెట్ మరియు కబడ్డీలను ఈ ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఛానెల్స్ డిష్ టీవీ, టాటా ప్లే, ఎయిర్టెల్, సన్ డైరెక్ట్, సిటీ నెట్వర్క్స్, ఇండియన్ కేబుల్ నెట్ కంపెనీ లిమిటెడ్, హిందూజా గ్లోబల్, ఫాస్ట్‌వే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్, తమిళక కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్, వికె డిజిటల్, యుసిఎన్ కేబుల్ నెట్వర్క్, టేక్ వన్, శ్రీ సాయి కేబుల్, కల్ కేబుల్, డిగియానా, భీమవరం, అక్సోం మొదలైన 500కు పైగా ప్రముఖ కేబుల్ మరియు పంపిణీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానెళ్లలో ఇకపై ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, కాంబాట్ స్పోర్ట్స్ వంటి అనేక రకాల క్రీడా కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు విభిన్న రకాల క్రీడా అనుభవాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే యూనిట్ 8 స్పోర్ట్స్ లక్ష్యం. యునైట్8 స్పోర్ట్స్ ఒకే వేదికపై వివిధ రకాల క్రీడల ద్వారా భారతదేశవ్యాప్తంగా వీక్షకులకు వినోదాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని.. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరియు యూనిట్8 స్పోర్ట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భావేష్ జనవలేకర్ తెలిపారు. భారతీయ ప్రేక్షకుల మారుతున్న అభిరుచులను ప్రతిబింబించేలా.. దేశవ్యాప్తంగా నాణ్యమైన, అందరికీ అందుబాటులో ఉండే ప్రత్యక్ష క్రీడా ప్రసారాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా.. తమ ఛానెళ్లలో రాబోయే ఫీఫా ఈవెంట్లను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్రీడల ద్వారా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఐక్యతా క్షణాలను సృష్టించడం ద్వారా భారతదేశంలో క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యునైట్8 ఒక అర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు. జూన్ 11, 2026న ప్రారంభమయ్యే ఫీఫా ప్రపంచ కప్ 2026కు సంబంధించిన ప్రత్యేక కవరేజీతో.. ఈ ఛానెళ్లు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు భావేష్ జనవలేకర్. Also Read: Telangana Govt: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే! Also Read: Telangana Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) 'యునైట్8 స్పోర్ట్స్' పేరుతో 4 కొత్త స్పోర్ట్స్ ఛానెల్‌లను ప్రారంభించింది, జూన్ 11 నుండి ఫీఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లను చూడవచ్చు.