
జీ5 యాప్‌లో FIFA ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లను చూడవచ్చు. ప్లాన్ల వివరాలు: ఆల్ యాక్సెస్ + స్పోర్ట్స్ ప్లాన్ నెలకు రూ.266, వార్షిక ప్లాన్ రూ.1,699. టీవీలో యూనిట్8 స్పోర్ట్స్ ఛానెల్‌లలో చూడవచ్చు. డిష్ టీవీ, టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ప్రసారాలు మొదలవుతాయి. యూనిట్8 స్పోర్ట్స్ 1, 2 హెచ్డీ ఛానెల్‌లు అందుబాటులో ఉన్నాయి. పన్నులు అదనంగా వర్తిస్తాయి. ఎయిర్టెల్, జియో వంటి ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా ఎంపిక చేసిన ప్లాన్లతో జీ5 ప్రీమియం యాక్సెస్‌ను అందిస్తున్నాయి. సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Zee5 FIFA World Cup 2026 Plans: ఫిఫా ప్రపంచ కప్ 2026పై ప్రసార హక్కులు జీ మీడియా పొందగా.. ఈ మ్యాచ్‌లు భారతదేశంలో అర్ధరాత్రి ప్రసారం కానున్నాయి. జీ ఎంటైర్టెన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు చెందిన జీ5, యునైట్8 స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లు వీక్షించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లు ఎలా చూడాలో తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లు టీవీలు, మొబైల్ ఫోన్లలో చూసేందుకు ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి. ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ భారత ప్రసార హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. 2030 ఫిఫా ప్రపంచ కప్‌నకు సంబంధించిన మీడియా హక్కులను కూడా పొందింది. 2026, 2030లో జరిగే పురుషుల ప్రపంచ కప్‌లను మాత్రమే కాకుండా.. 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌తో సహా 2034 వరకు జరిగే 39 ఫిఫా ఈవెంట్ల విస్తృత ప్యాకేజీ అందిస్తోంది. ఫుట్‌బాల్‌కు అతిపెద్ద టోర్నమెంట్‌ను టెలివిజన్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, టీటీహెచ్ ప్లాట్‌ఫారమ్‌లలో చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు.. ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను డిజిటల్‌గా చూడాలనుకునే ప్రేక్షకులు జీ5 యాప్, వెబ్సైట్లో చూడవచ్చు. స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విస్తరించడం, పెయిడ్ సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని చూస్తోంది. ప్లాన్లు ==> జీ5 ఆల్ యాక్సెస్ + స్పోర్ట్స్ (3 నెలలు) ==> రూ.799 (నెలకు రూ.266) ==> జూన్ 11 నుంచి జూలై 19వ తేదీ వరకు జరిగే మొత్తం ప్రపంచ కప్ చూడవచ్చు ==> జీ5 ప్రీమియం వార్షిక ప్లాన్ ==> సంవత్సరానికి రూ.1,699 (నెలకు రూ.142) ==> 4కే అల్ట్రా హెచ్డీ స్ట్రీమింగ్ ==> డాల్బీ అట్మోస్ ఆడియో ==> ఒకేసారి నాలుగు డివైసెస్‌లో స్ట్రీమింగ్ ==> జీ5 విస్తృతమైన ప్రీమియం వినోద కేటలాగ్‌కు యాక్సెస్ ఫిఫా ప్రపంచకప్ ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే ముందు వీక్షకులు ఇప్పటికే ఉన్న టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా పరిశీలించుకోవాలి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఓటీటీప్లే, టాటా ప్లే బింజ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా ఎంపిక చేసిన ప్లాన్లతో జీ5 ప్రీమియం యాక్సెస్‌ను అందిస్తున్నాయి. అదనపు సబ్స్క్రిప్షన్ ఖర్చులను తగ్గించడంలో లేదా పూర్తిగా తొలగించడంలో ఇది సహాయపడవచ్చు. చాలా మంది వినియోగదారులు మెరుగైన విలువను పొందవచ్చు. టీవీలో ఫీఫా ప్రపంచ కప్ 2026ను ఎలా చూడాలి టెలివిజన్ ప్రసారాలను ఇష్టపడే ప్రేక్షకులు జీ కొత్తగా ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లను చూడవచ్చు. ప్రత్యేక ఇంగ్లీష్, హిందీ ఫీడ్లు మ్యాచ్‌లు అందిస్తాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్రసార సంస్థ అధికారికంగా నాలుగు క్రీడా ఛానెళ్లను ప్రారంభించింది. ఆ చానళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. యునైట్8 స్పోర్ట్స్ 1 యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ యునైట్8 స్పోర్ట్స్ 2 యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ ఛానెళ్లు దేశవ్యాప్తంగా 500కు పైగా కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి. డిష్ టీవీ, టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, సన్ డైరెక్ట్, సిటీ నెట్వర్క్స్, ఇండియన్ కేబుల్ నెట్ కంపెనీ లిమిటెడ్, హిందుజా గ్లోబల్, ఫాస్ట్‌వే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్), కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ (కేసీసీఎల్), తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్, వికె డిజిటల్, యుసీఎన్ కేబుల్ నెట్వర్క్, టేక్ వన్, శ్రీ సాయి కేబుల్, కల్ కేబుల్, డిగియానా, భీమవరం, అక్సోం వంటి వాటిల్లో కూడా ఆయా చానల్స్ ప్రసారాలు వస్తాయి. యునైట్8 స్పోర్ట్స్ ఛానల్ ధరలు జీ రెఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్ (ఆర్ఐఓ) ప్రకారం నెలవారీ ఛానల్ ధరలు ఇలా ఉన్నాయి. యునైట్8 స్పోర్ట్స్ 1 - రూ.7 యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ -రూ.9 యునైట్8 స్పోర్ట్స్ 2 — రూ.8 యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ - రూ.11 (అన్ని ధరలలో వర్తించే