
LIC shares | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో 50 శాతం మేర క్షీణించినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఎల్ఐసీ బోనస్ ఇష్యూ సంగతి తెలీని వారు ఈ మార్పు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం నుంచి బోనస్ షేర్ల జారీ షేరు విలువలో ప్రతిఫలించడమే ఇందుకు కారణం. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు విలువ రూ.830గా ఉంది. బోనస్ షేరు వల్ల విలువ సగమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మార్కెట్ ప్రారంభంలో రూ.417.60 వద్ద ప్రారంభమైంది. తర్వాత ఒక శాతం నష్టంతో రూ.411 వద్ద మగిసింది. అంటే నష్టపోయింది ఒక శాతం లోపే. కానీ, 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయడం వల్ల స్టాక్ ధరలో పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు కనిపించింది. మే 29 నాటికి ఎల్ఐసీ షేర్లు ఉన్నవారికి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని ఎల్ఐసీ నిర్ణయం తీసుకుంది. రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు కలిగిన వాటాదార్లకు అదనంగా రూ.10 ముఖ విలువ కలిగిన మరో ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 2025 డిసెంబరు 31 నాటికి ఎల్ఐసీ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల నిల్వలు, మిగులు నిధులతో ఈ బోనస్ ఇష్యూను పూర్తి చేయనున్నట్లు ఎక్స్ఛేంజీలకు గతంలో ఎల్ఐసీ సమాచారం ఇచ్చింది. దీనివల్ల కంపెనీ షేర్లు సంఖ్య పెరగడమే కాకుండా.. రిటైల్ మదుపర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. షేర్ల సంఖ్య పెరిగినంత మాత్రాన కంపెనీ మార్కెట్ విలువలో ఎలాంటి మార్పూ ఉండదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.