
Lord Ganesh Dream Meaning Telugu: కలలో గణేశుడిని చూడటం, ఆయనను పూజిస్తున్నట్లు కనిపించడం, గణేశుడితో పాటు ఎలుక కనిపించడం వంటి కలలకు స్వప్న శాస్త్రంలో ప్రత్యేక అర్థాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే గణేశుడి నిమజ్జనం కలలో కనిపిస్తే మాత్రం దాన్ని అశుభ సంకేతంగా పరిగణిస్తారు.
Lord Ganesh Dream Meaning Telugu: హిందూ మత విశ్వాసాల ప్రకారం గణేశుడిని విఘ్నాలను తొలగించే దైవంగా, అన్ని శుభకార్యాలకు తొలిపూజ అందుకునే దేవుడిగా భావిస్తారు. అందుకే ఏ పూజ, వ్రతం లేదా శుభకార్యమైనా ముందుగా గణపతిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.





