
భారాస నేతల ఫాంహౌస్ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని.. రంగనాయకసాగర్ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్నగర్ ఫాంహౌస్లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

భారాస నేతల ఫాంహౌస్ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని.. రంగనాయకసాగర్ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్నగర్ ఫాంహౌస్లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది.
ఫాంహౌస్‌లు చింతమడకలో కాకుండా ఎర్రవల్లి, జన్వాడలో ఎందుకు నిర్మించారు: ఎంపీ చామల అజీజ్‌నగర్, మొయినాబాద్‌ల్లోని ఫాంహౌస్‌లు పరిశీలించిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌ వద్ద మాట్లాడుతున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఈనాడు, హైదరాబాద్‌-మొయినాబాద్, న్యూస్‌టుడే: భారాస నేతల ఫాంహౌస్‌ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని.. రంగనాయకసాగర్‌ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, బి.మనోహర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌ తదితరులతో కూడిన బృందం ఆదివారం ప్రజాభవన్‌ నుంచి బయలుదేరి రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్, మొయినాబాద్‌లోని మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ల వద్దకు వెళ్లింది. వాటికి తాళం వేసి ఉండటంతో.. పరిసర ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ చామల మాట్లాడుతూ... ‘జీవో 111 పరిధిలోకి వచ్చే అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావు, రోహిత్‌రెడ్డి భవంతులు ఎలా నిర్మించారు? తమకు ఆస్తులు పూర్వీకుల నుంచి వచ్చాయని కేటీఆర్‌ అంటున్నారు. వారిది చింతమడక అయితే ఫాంహౌస్‌లు జన్వాడ, ఎర్రవల్లి, అజీజ్‌నగర్‌లో ఎలా నిర్మించారు? పేదల కోసం పంపిణీ చేసిన ఎసైన్డ్‌ భూమిలో ఫాంహౌస్‌ కట్టుకునే అధికారం రోహిత్‌రెడ్డికి ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. మల్లు రవి మాట్లాడుతూ రోహిత్‌రెడ్డి ఎసైన్డ్‌ భూములు తీసుకొని ఫాంహౌస్‌ నిర్మించినట్లు తెలుస్తోంది. వాటిని స్వాధీనం చేసుకుని దళితులకు పంచాలని సీఎంకు విన్నవిస్తామన్నారు. అనిల్‌కుమార్‌యాదవ్, నవీన్‌ యాదవ్‌ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి రోహిత్‌రెడ్డి భూములు కొన్నట్లు స్థానికులు చెబుతున్నారని.. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరతామన్నారు. అజీజ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందానికి ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





