
కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో భారాసలో చేరికల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో భారాసలో చేరికల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరవుకు కాంగ్రెస్‌ వైఫల్యాలే కారణం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు మోటకొండూరులో మాట్లాడుతున్న హరీశ్‌రావు, చిత్రంలో రామకృష్ణారెడ్డి, గొంగిడి సునీత, భిక్షమయ్యగౌడ్, కర్నె ప్రభాకర్, పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు మోటకొండూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పాలనతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో భారాసలో చేరికల సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కరెంట్‌ కోతలపై వాస్తవాలు తెలుసుకునేందుకు మోటకొండూరులోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘లాగ్‌బుక్‌లను అధికారులు ముందుగానే మాయం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు లాగ్‌బుక్‌లను మాయం చేసింది? సాగుకు ఆరు నుంచి ఏడు గంటలు సరఫరా కావడం లేదు. తరచూ ట్రిప్‌ అవుతోంది. విద్యుత్తు సరఫరాపై స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సబ్‌స్టేషన్ల వద్దకు వచ్చి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కరవు పరిస్థితులకు ఎల్‌నినో కంటే కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే పెద్ద కారణం. అందుబాటులో నీరు, విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. 22ఏ నిషేధిత భూముల అంశంపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. అజీజ్‌నగర్‌ భూములకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో, ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించాం. మా ఆస్తులు, కాంగ్రెస్‌ నేతల ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై చర్యలు తీసుకోవాలి. ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆరు గ్యారంటీల అమలు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్దకు యాత్రలు చేయాలి’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు కర్నె ప్రభాకర్, క్యామ మల్లేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





