

Bigg Boss Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారమే ఇద్దర్ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక నిన్న సోమవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. రెండవ వారంలో నామినేషన్స్ కి కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరిద్దర్ని పిలిచి ఆ టాస్క్ ఆడించాడు. అందులో గెలిచినా వాళ్ళు అక్కడ ఉన్న గోల్డ్, సిల్వర్ గొడ్డలిలో ఏదో ఒకటి తీసుకోవాలి. సిల్వర్ గొడ్డలి అందుకుంటే ఒకర్ని, గోల్డ్ గొడ్డలి అందుకుంటే ఇద్దర్ని నామినేట్ చేయొచ్చు. అలాగే అలాగే టాస్క్ లో ఓడిపోయినవాళ్లు కూడా నామినేట్ అవుతారు అని చెప్పాడు.





