
సాధారణంగా మనం బీరకాయ కూర చేసేటప్పుడు దాని పైన ఉండే తొక్కను పారేస్తుంటాము. కానీ, బీరకాయ తొక్కతో చేసే పచ్చడి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని తెలిస్తే నోరెళ్ల బెడతారు. ఎందుకంటే.. బీరకాయ తొక్కలో శరీర ఆరోగ్యానికి అవసరమైన పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్కతో చేసిన పచ్చడి తినటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచి, వేడి వేడి అన్నం, రోటీ లేదా దోసలోకి అద్భుతమైన రుచిని ఇస్తుంది.
కాయగూరలు తరిగేటప్పుడు చాలామంది బీరకాయ పొట్టు లేదా తొక్కను పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ, కొన్ని ప్రాంతంలో ఈ బీరకాయ తొక్కతో అద్భుతమైన, కారంగా ఉండే పచ్చడిని తయారు చేస్తారు. ఇది వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.




