
Andros Townsend Pitch Roller Accident Thai League: థాయ్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ వామప్ సమయంలో ఇంగ్లాండ్ (England) మాజీ అంతర్జాతీయ ఆటగాడు ఆండ్రోస్ టౌన్సండ్ (Andros Townsend) ఊహించని ప్రమాదానికి గురయ్యారు. మైదానంలో కదులుతున్న పిచ్ రోలర్ ఈ 35 ఏళ్ల ప్లేయర్ కాళ్లు, తుంటిపై నుంచి వెళ్లడంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
Andros Townsend Pitch Roller Accident Thai League: పీటీ ప్రచువాప్ (PT Prachuap) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రోస్ టౌన్సండ్ (Andros Townsend) పట్టాని (Pattani) జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని అద్భుతమైన బ్యాక్హీల్ షేప్‌తో గోల్ పోస్ట్ వైపు కొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన నేలపై పడగా, అప్పటికే కదులుతున్న పిచ్ రోలర్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో వాహనం ఆ ఆటగాడి శరీరంపైకి దూసుకెళ్లింది. రోలర్ చక్రాలు ఆయన కాళ్లు, తుంటి భాగం మీద నుంచి వెళ్లడంతో అక్కడివారంతా భయంతో హడలిపోయారు. మైదానంలో ఉన్న తోటి ఆటగాళ్ళు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.





