
ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్లకొకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత ఐరిస్, వేలిముద్రలను నమోదు చేసుకోవాలి.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్లకొకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత ఐరిస్, వేలిముద్రలను నమోదు చేసుకోవాలి.
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆధార్‌ కార్డు పొందిన తర్వాత పదేళ్లకొకసారి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత ఐరిస్, వేలిముద్రలను నమోదు చేసుకోవాలి. 5 నుంచి ఏడేళ్ల లోపున్న వారు, 15-17 ఏళ్లలోపు విద్యార్థులు ఇప్పటి వరకు ఆధార్‌ నవీకరణ చేయించుకోలేదు. ఇలాంటి వారు జిల్లాలో 31 వేల మంది ఉన్నట్లు అంచానా. వీరి వివరాల అప్‌డేట్‌ కోసం జిల్లా వ్యాప్తంగా ఈనెల 21 నుంచి అక్టోబర్‌ 20 వరకు ఉచిత ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 124 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పరిధిలో ఆధార్‌ అప్‌డేట్‌ సేవలు ఉచితంగా అందించనున్నారు. వీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థుల జాబితాను ఇప్పటికే పాఠశాలలకు అందించారు. మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తించి సమాచారం సేకరిస్తున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ నవీకరణతో పాటు చిన్నారులకు ఉచితంగా నమోదులు చేయనున్నారు. బిడ్డ జనన ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌లో మార్పులు, చేర్పులకు జనన ధ్రువపత్రం, పదోతరగతి మార్కుల జాబితా, చిరునామా ధ్రువపత్రాలు తీసుకువెళ్తే చాలు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి







