
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ( వివాహానంతర వేడుకలకు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్ ఆర్థిక సహాయం చేసినట్లు వచ్చిన నివేదికలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. పుతిన్‌తో సంబంధాలున్న వ్యక్తిగా పేర్కొంటున్న క్రెమ్లెవ్ బహామాస్‌లో జరిగిన ప్రైవేట్ ఐలాండ్ వేడుకలు, బాణసంచా వంటి ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. దీనిపై ట్రంప్ కుటుంబం వివరణ ఇవ్వగా, అమెరికా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది.





