
కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్టు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ప్రకటన వెలువడింది. నిర్దేశిత విభాగాల్లో పీజీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్టు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ప్రకటన వెలువడింది. నిర్దేశిత విభాగాల్లో పీజీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.
కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్టు పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన వెలువడింది. నిర్దేశిత విభాగాల్లో పీజీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు లెవెల్‌-10 వేతనాలు అందుకోవచ్చు. యూ పీఎస్‌సీ నిర్వహించే కంబైన్డ్‌ జియో సైంటిస్టు పోస్టుల్లో అవకాశం వచ్చినవారు గ్రూప్‌ ఏ/ గ్రూప్‌ బీ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌.. తదితర సంస్థల్లో సేవలందిస్తారు. ఈ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ దాదాపు ఏటా ప్రకటనలు విడుదలచేస్తోంది. వీటికి ఎంపికైతే రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు. స్టేజ్‌-1 ప్రిలిమినరీ, స్టేజ్‌-2 మెయిన్స్, స్టేజ్‌-3 ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టులపై గట్టి పట్టు ఉన్నవారు పరీక్షలో విజయం సాధించవచ్చు. అందువల్ల పీజీ పాఠ్యాంశాలు బాగా అధ్యయనం చేయాలి. జియో సైంటిస్టు పాత ప్రశ్నాపత్రాలతో పాటు ఆ సబ్జెక్టుల్లో నెట్‌ పేపర్లు పరీక్షలో విజయానికి బాగా ఉపయోగపడతాయి. ప్రిలిమినరీ (స్టేజ్‌-1) ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నాపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. దీన్ని డిస్క్రిప్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం ఆంగ్లంలో ఉంటుంది. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. మెయిన్స్‌లో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కూ 3 గంటల వ్యవధి. స్టేజ్‌-2లో అర్హుల జాబితా నుంచి విభాగాలవారీ మొత్తం ఖాళీలకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను స్టేజ్‌-3కి ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగినవారా లేదా గమనిస్తారు. నాయకత్వ లక్షణాలతో పాటు ఇతర సామర్థ్యాలనూ అంచనావేసి మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు అన్ని దశల్లోనూ అంటే స్టేజ్‌-1, స్టేజ్‌-2, స్టేజ్‌-3ల్లో సాధించిన మొత్తం మార్కులతో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. పోస్టులు: 127. వీటిలో కేటగిరీ-1 జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో.. జియాలజిస్టు 29, కెమిస్టు 7, అసిస్టెంట్‌ జియాలజిస్టు 34, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్టు 35, అసిస్టెంట్‌ కెమిస్టు 6 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ-2 సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో.. హైడ్రో జియాలజిస్టు గ్రూప్‌-ఏలో 5, గ్రూప్‌-బీలో 7, కెమికల్‌ 1, జియో ఫిజిక్స్‌ 1, అసిస్టెంట్‌ కెమిస్టు 1, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్టు 1 ఉన్నాయి. అర్హత: జియాలజిస్టు పోస్టులకు పీజీలో జియాలజీ /అప్లయిడ్‌ జియాలజీ/ ఇంజినీరింగ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ ఎర్త్‌ సైన్స్‌/ ఓషనోగ్రఫీ/ జియోకెమిస్ట్రీ.. తదితర కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. కెమిస్ట్, కెమికల్‌ పోస్టులకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ అనలిటికల్‌ కెమిస్ట్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. హైడ్రో జియాలజీ ఖాళీలకు పీజీలో జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ హైడ్రో జియాలజీ చదివినవారు అర్హులు. జియో ఫిజిక్స్, జియో ఫిజిసిస్ట్‌ పోస్టులకు ఎమ్మెస్సీ అప్లయిడ్‌ ఫిజిక్స్‌/ జియో ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌/ మెరైన్‌ జియోఫిజిక్స్‌ కోర్సులవారు అర్హులు. వయసు: జనవరి 1, 2027 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995 - జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 22 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు. మిగిలినవాళ్లు రూ.200 చెల్లించాలి. ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జనవరి 10. మెయిన్స్‌ పరీక్షలు: జూన్‌ 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌ వెబ్‌సైట్‌: www.upsc.gov.in/ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





