
మెగా డీఎస్సీతో పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం చేసింది.
© 2026 telugu.digital
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

మెగా డీఎస్సీతో పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం చేసింది.
ప్రణాళికాబద్ధంగా యువత సన్నద్ధం నూజివీడు, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీతో పెద్ద ఎత్తున టీచర్‌ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. ఏళ్ల తరబడి భర్తీ చేయని పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. - పటాపంచల జగదీశ్, శోభనాపురం ఎంకాం వరకు చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కోచింగ్‌ తీసుకుంటున్నా. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న భరోసా నాలాంటి యువత సద్వినియోగం చేసుకోవాలి. -ఎన్‌.ప్రిన్సీ గోల్డ్, ఆగిరిపల్లి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే ఉపాధ్యాయు పోస్టులు భర్తీ చేసి భేష్‌ అనిపించుకున్నారు. బీటెక్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. - తొమ్మండ్రు జయమణి, ఈదులగూడెం ఏపీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నా. నాలాంటి డిగ్రీ చేసిన నిరుద్యోగులకు చక్కటి అవకాశం. నియామక పోటీని ప్రణాళికతో ఎదుర్కొని ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం భరోసా ఇస్తుంది.. - వి.రత్నబోస్, పోతవరప్పాడు మనిషి జీవితానికి ప్రభుత్వ ఉద్యోగం పెద్ద భరోసా ఇస్తుంది. పీజీ చదివా. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. కష్టపడి చదువుతున్నా. నియామక పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం సాధిస్తా. గ్రూప్‌-2 పోస్టు సాధించడమే లక్ష్యం.. - దొప్పల నాగేశ్వరరావు, రాజవరం ఎంఏ బీఈడీ విద్యను అభ్యసించా. గ్రూప్‌-2 ఉద్యోగమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన ఓ వరం. ప్రతి రోజు ఒక ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించా. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telugu.Digital EditorialSenior Editorial Lead
Telugu.Digital
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





