
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు వరంగల్ నగర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD), ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, పర్యాటక రంగం తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్షలో వరంగల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను అధికారులతో సీఎం చర్చించారు. భారీ నిధులతో అండర





