translateexpand_more

Karthika Deepam News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu01 Jun, 02:30 am
జ్యోకి రక్తకన్నీరు.. అటు కార్తీక్ ఇటు సూరజ్ ఒకే వాయింపు.. తప్పించుకోలేక అల్లాడిన సైకో పాప.. ఇది కదా

Karthika Deepam June 01 Episode: ఆస్తి కోసం, ఆఫీస్ పెత్తనం కోసం కలలు కంటున్న జోత్స్నకి నిన్నటి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పెద్దాయన శివన్నారాయణ. ఇక ఈరోజు (జూన్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. జ్యోత్స్స కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న, పారిజాతంను తీసుకుని స్టాల్ వద్దకు వస్తాడు. "నా బ్రదర్ టైమింగ్ ఎప్పుడూ మిస్ అవ్వదు " అంటాడు సూరజ్ కార్తీక్ ను చూస్తూ. "ఏంటీ పెద్ద మేడమ్ గారు. కారు దిగరేంటీ.. మనం వచ్చింది ఊరికే చూడటానికి కాదు. పని చేయడానికి. దిగండి దిగండి " అంటాడు కార్తీక్ వెటకారంగా. "రాత్రి నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి రావు అనుకున్నానే" అంటుంది పారిజాతం. "ఎప్పుడు ఏం చేయాలో జ్యోత్స్నకు బాగా తెలుసు గ్రానీ. నేను తల దించుకున్న అందులో ఏదో మంచే ఉంటుంది. నేను వస్తే వీడికి ఏదో మంచి జరుగుతుంది అనుకుంటున్నాడు. ఏం చేస్తానో చూడు" అంటుంది జ్యోత్స్న పొగరుగా. "మళ్లీ ఏం చేస్తావే" అంటుంది పారిజాతం కంగారుగా. "ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా"అంటుంది జ్యోత్స్న.నా వల్ల తప్పు జరిగింది.. జోత్స్నకి దిమ్మతిరిగే షాక్ "హాలో పెద్ద మేడమ్ గారు. నువ్వొచ్చింది కారులో కూర్చుని కబుర్లు చెప్పడానికి కాదు. పని చేయడానికి. అక్కడ కస్టమర్లు వెయిటింగ్" అంటాడు కార్తీక్. "దిగుతున్నాం రా" అంటుంది పారిజాతం. సూరజ్ స్టాల్ ముందు జ్యోత్స్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో "నావల్ల తప్పు జరిగింది... సూరజ్ హెల్తీ ఫుడ్స్ ఈజ్ ది బెస్ట్ " అని రాసి ఉండడం చూసి షాకవుతుంది జ్యోత్స్న. "అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు. నేను ఇచ్చే

Asianet News Telugu30 May, 04:47 am
జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని గా పనికిరావన్న శివన్నారాయణ

Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ ఈ వార్తకు సంబంధించిన

Samayam Telugu29 May, 05:16 am
సూరజ్ కే తాత ఓటు.. నిస్సహాయంగా జ్యో.. ఇది మామూలు ప్రతీకారం కాదురయ్యో

"బ్రదర్ అన్నీ ఇప్పటికిప్పుడు అంటే " అంటాడు కార్తీక్. "ఓకే బ్రదర్. ఈవినింగ్ వరకు టైమ్ ఇస్తాను. ఈలోపు మీకు మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఉంటానండి. థ్యాంక్యూ " అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. "తాత వాడి మాటలు నమ్మకండి తాత. బావ ఎప్పుడూ బయటవాళ్లకే సపోర్ట్ చేస్తాడు. అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాలను మనం ఎంకరేజ్ చేస్తే రోజుకు ఒకడు ఇంటికి వచ్చి ఇలాగే గొడవ చేస్తాడు. అసలు వాడోక వెస్ట్ ఫేలో తాత. అసలు వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ తాత" అంటుంది జ్యోత్స్న. శివనారాయణ మౌనంగా ఉండిపోతాడు. గదిలో జ్యోత్స్నా, పారిజాతం ఇద్దరూ సూరజ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటారు. "నువ్వు అర్జెంటుగా తట్ట బుట్ట సర్దుకొని ఏ ప్రపంచ యాత్రకో పోవే" అంటుంది పారిజాతం. "జరిగినదాంట్లో నా తప్పేమి లేదు గ్రానీ " అంటుంది జ్యోత్స్న ధీమాగా. "ఆ.. నీదే తప్పు లేకపోతే వాడు ఇల్లు వెతుక్కుంటూ ఎలా వస్తాడు " అంటుంది పారిజాతం. "వాడోక వేస్ట్ ఫెలో " అంటుంది జ్యోత్స్న. "ఈ మాట వాడికంటే బాగా నీకే సూటయ్యేలా ఉంది. అరవకు. మండుతుంది ఇక్కడ. దారినపోయే దరిద్రాలన్నీ ఇంటి మీదకు తీసుకువస్తున్నందుకు. వాడు ఎవడైనా కానీ. నువ్వు గొడవ పడడం అవసరమా. ఎప్పుడు ఏదోక పెంట. అయితే దీపతో, కార్తీక్ గాడితో లేదంటే ఆ వైరా గాడితో.. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి గొడవలు పెట్టుకోవడానికి వేరోకడు " అంటుంది పారిజాతం. "నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరోక పని లేదనుకుంటున్నావా" అంటుంది జ్యోత్స్న. "చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. సైకోలా తయారయ్యావు.

Asianet News Telugu26 May, 05:02 am
Karthika Deepam 2: దక్షిణమూర్తికి యాక్సిడెంట్ ప్రాణం కాపాడిన శివన్నారాయణ | Asianet News Telugu

సుమిత్ర తండ్రి దక్షిణామూర్తికి యాక్సిడెంట్. హాస్పిటల్ కి తీసుకెళ్లిన దీప, కార్తీక్. రక్తం ఇచ్చి ప్రాణం కాపాడిన శివన్నారాయణ. నిజం తెలిస్తే గొడవలు తప్పవని కార్తీక్ ని హెచ్చరించిన శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Samayam Telugu27 May, 12:43 pm
రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడరు.. కానీ మా నాన్నగారు అప్పట్లోనే

రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హ్యూమన్ ఇంట్రస్ట్ రియల్ స్టోరీలు, కథలు, సినిమా రివ్యూలు అందిస్తుంటారు. సినిమా, టీవీ రంగాలకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసిన అనుభవం శేఖర్‌కు ఉంది. క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి గత మూడు ఎన్నికల కోసం గ్రౌండ్ రిపోర్ట్ అందించిన అనుభవం ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ టైమ్స్ ఇంటర్నెట్ అందించే మ్యాజికల్ మోటివేటర్ (2023), సూపర్ స్టార్ (2022), అబౌవ్ అండ్ బియాండ్ ది కాల్ ఆఫ్ డ్యూటీ (2019), ఇతర అవార్డులు శేఖర్ కుసుమకు లభించాయి. శేఖర్ కుసుమ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ అండ్ టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. ఎన్టీవీలో న్యూస్ ప్రొడ్యుసర్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆ సమయంలో సినిమా, పొలిటికల్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కథలు రాయడం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Samayam Telugu01 Jun, 01:07 pm
ఈవీవీ గారు అవకాశం ఇచ్చారు కానీ.. అల్లరి నరేష్ వల్లే ఆ సినిమాపోయింది.. స్ట్రాంగ్ బ్యాగ్రౌండ్ ఉంటేనే సినిమాలు

నిరుపమ్ పరిటాల అంటే మనకి కార్తీకదీపం సీరియల్ గుర్తొస్తుంది. డాక్టర్ బాబుగా.. కార్తీక్‌గా బుల్లితెరను షేక్ చేస్తున్నారాయన. అయితే నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ పరిటాల ఫేమస్ రైటర్. ఆయన చనిపోయి చానాళ్లు అయ్యింది కానీ.. రైటర్‌గా నటుడిగా మంచి పేరు సంపాదించారు. దాదాపు పాతికకి పైగా సినిమాలకు కథ, మాటలు అందించారు ఓంకార్. ఇక అప్పట్లో ఏ సూపర్ హిట్ సీరియల్ వచ్చినా కూడా.. అందులో ఓంకార్ కథ అయినా ఉండేది.. ఆయన మాటలైనా వినిపించేవి.. లేదంటే ఆయన రూపమైనా కనిపించేది. తన విలక్షణ నటనతో నాటి రావుగోపాలరావుని గుర్తు చేసేవారు నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్. అయితే తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిరుపమ్ పరిటాల.. చంద్రముఖి సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తరువాత మావిచిగురు, కన్యాదానం, కలవారి కోడలు, కుంకుమపువ్వు, కార్తీకదీపం ఇలా దాదాపు 15కి పైగా సీరియల్స్‌లో కథానాయకుడిగా చేశారు. అయితే నిరుపమ్ పరిటాలను బుల్లితెర స్టార్ హీరోని చేసింది మాత్రం కార్తీకదీపం సీరియల్‌నే. తండ్రి పెద్ద రైటర్ కదా.. పైగా నిరుపమ్ పరిటాల చూడ్డానికి హీరో మెటిరియల్ మాదిరే ఉంటారు కదా.. ఎంతోమంది హీరోలకు కథలు అందించిన ఓంకార్ పరిటాల.. కొడుకోసం కథ రాయలేదా? ఆయన్ని హీరోగా పెట్టాలనిపించలేదా అంటే.. ‘మా వాడు సినిమాల్లోకా? ఆ మాట నా దగ్గర అన్నారు కానీ.. వాడి దగ్గర అనొద్దని తన సన్నిహితుల దగ్గర చెప్పేవారట ఓంకార్ పరిటాల. అయితే తండ్రి వారసత్వాన్ని వదల్లేక.. టీవీ రంగం వైపు అడుగులు వేశారు నిరుపమ్ పరిటాల. మరి సినిమాల్లో ఛాన్స్‌లు రాలేదా? ఎవరూ నిరుపమ్ పరిటాలకి అవకాశం ఇవ్వలేదా అంటే.. నాటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ‘ఫిట్టింగ్ మాస్టర్’ చిత్రంలో నిరుపమ్