translateexpand_more

Kesineni Chinni News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu01 Jun, 04:24 pm
బాబాయ్ ని మించిన అబ్బాయి.. ఇంద్ర తర్వాత ఇదే.. పెద్ది ఈవెంట్లో విజయవాడ ఎంపీ స్పీచ్ వైరల్

Kesineni Chinni : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గెస్ట్ గా హాజరయ్యారు. Also Read : Peddi Business: ‘పెద్ది’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి.. ఈవెంట్లో కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ఈవెంట్ పెట్టినందుకు రామ్ చరణ్ కి ధన్యవాదాలు. విజయవాడ సినిమా రాజధాని. ఇక్కడ ఎన్నో శతదినోత్సవాలు జరిగాయి. ఇంద్ర సిల్వర్ జూబ్లీ విజయవాడలో జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటో చూసారు. మెగాస్టార్ తర్వాత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి.. ఎన్నో సినిమాలు ఈ విజయవాడలో ఆదరించారు. తండ్రిని మించిన తనయుడు, బాబాయ్ ని మించిన అబ్బాయి మా రామ్ చరణ్. ఇవాళ విజయవాడ యూత్ ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో పెద్ద హిట్ అయింది. విజయవాడలో రికార్డులు మీకిస్తాము. రామ్ చరణ్ జీవితం అంత ఈజీ కాదు. ఆయనకు క్రమశిక్షణ, కష్టం అన్ని తెలిసి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు. అందుకే యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా విజయవాడ లేదా