ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే మార్కెట్‌లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో మద్యం బాటిళ్లను తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90, 180, 375, 750, 1000 ఎంఎల్ లిక్కర్ బాటిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మద్యం సరఫరా చేసే కంపెనీలు సరికొత్త ఆలోచన చేశాయి. 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో బాటిల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతిపాదించాయి.. ఎక్సైజ్‌శాఖ కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇకపై ఒక కేసులో 200 ఎంఎల్ బాటిళ్లు 45, 150 ఎంఎల్ బాటిళ్లు 60 ఉంటాయి. ఈ కొత్త లిక్కర్ బాటిళ్లకు సంబంధించి.. ఐఎంఎఫ్ఎల్ (చౌకమద్యం) రూల్స్‌ను సవరిస్తూ ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా లిక్కర్ షాపుల్లో ఎక్కువ మంది క్వార్టర్ సీసాలే కొనుగోలు చేస్తుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్ చాలనుకుంటే అందులో సగం 90ఎంఎల్ ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న 150, 200 ఎంఎల్ బాటిల్స్ ధర కొంత తగ్గుతుందని.. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకూ వర్తిస్తాయి కాబట్టి అమ్మకాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు, బార్ల దగ్గర బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. మంత్రి ఆదేశాలు మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. మద్యం షాపులు, బార్ల యజమానులు ఈ ప్రభుత్వ ఆదేశాలకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మద్యం షాపులు, బార్ల దగ్గర ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ బ్రాండ్‌లను ప్రచారం చేసుకోవడానికి బ్రాండ్ పేరుతో పాటుగా షాపు, బార్ లైసెన్స్ తీసుకున్న పేరుతో కలిపి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదన్నారు అధికారులు. కానీ మద్యం బ్రాండ్ కంపెనీలన్నీ ప్రచారం కోసం.. అదే బ్రాండ్ పేరుతో సోడా, మంచినీళ్లు అమ్మేలా రిజిస్ర్టేషన్ చేసుకుంటాయని గుర్తు చేశారు. మద్యం షాపులు, బార్ల దగ్గర ఏర్పాటు చేసే బ్రాండ్ పేరు పెద్దగా చూపించింది.. మంచినీళ్లు, సోడా అని ప్రింట్ చేస్తారని ఆరోపించారు. అందుకే మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా కంపెనీలు వారి బ్రాండ్ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధం అమలుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
Liquor Shops News
Latest updates from Telugu Digital news sources.

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్ల వద్ద వివిధ మద్యం బ్రాండ్ల పేర్లతో ఉండే బోర్డులు, హోర్డింగులు, ప్లెక్సీల ఏర్పాటును నిషేధించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్రతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Also Read : KTR Political Counter Pawan kalyan : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. ఆ నిర్ణయం సరైందికాదు.. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజారోగ్యం, సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. రాష్ట్రంలోని చాలా వరకు మద్యం షాపుల వద్ద ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు ఉన్నాయి. వారి బ్రాండ్లను ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఆయా బ్రాండ్ల పేరు, లైసెన్సీ పేరుతో కలిపి బోర్డులు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం.. మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదు. అయితే, కంపెనీలన్నీ ప్రచారంకోసం అదే బ్రాండ్ పేరుతో మంచినీళ్లు, సోడాలు అమ్మేలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. షాపుల వద్ద పెట్టే బోర్డులో ఆ బ్రాండ్ పేరు పెద్దగా చూపించి.. చిన్నగా మంచినీళ్లు, షోడా బాటిల్స్‌ను ముద్రిస్తారు. ఇది సాంకేతికంగా నిబంధనల ఉల్లంఘన కాదు. అందుకే షాపు వద్ద ఆయా కంపెనీలు వారి బ్రాండ్ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. మద్యం బాటిళ్ల సైజులో రూల్స్ సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ఎన్నేసి సీసాలు ఉండాలో కూడా ఖరారు చేసింది. దీంతో కొత్త పరిమాణంలో మద్యం సీసాలు రానున్నాయి. చాలాకాలంగా వీటి పరిమాణం 180, 375, 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ుంది. ఇవి కాకుండా.. లీటరు, 90ఎంఎల్ సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 150, 200 ఎంఎల్ పరిమాణంతో సీసాలు తయారు చేస్తామని, అనుమతివ్వాలని ఇటీవల కొన్ని మద్యం కంపెనీలు కోరాయి. అందుకు అనుగుణంగా చౌకమద్యం (ఐఎంఎఫ్ఎల్) రూల్స్ ను సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఒక కేసుకు క్వార్టర్ సీసాలైతే 48, హాఫ్ బాటిళ్లు 24, ఫుల్ బాటిళ్లు 12 ఉంటాయి. కొత్తగా రాబోయే 150ఎంఎల్ సీసాలైతే 60, అదేవిధంగా 200 ఎంఎల్ సీసాలు అయితే ఒక కేసులో 45 ఉంటాయి.