translateexpand_more

Telugu Cinema News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy01 Jun, 02:05 pm
విడుదలకి సిద్ధమవుతున్న 'ఎల్ జి బీ టీ... ఏ లీగల్ బ్యాటిల్

సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్ జి బీ టీ - ఏ లీగల్ బ్యాటిల్'. ఈ సినిమాను ప్రైడ్‌ మంత్ సందర్భంగా జూన్‌ 19న దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

సునీల్‌ కుమార్ రెడ్డి సినిమాలోని నటీనటుల గురించి వివరిస్తూ, 'ఎల్ బి శ్రీరామ్ , ఎస్తర్ నొరోన్హా , రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ లాంటి ప్రముఖ నటీనటులతో పాటు చాలా మంది రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు, గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారు' అని తెలిపారు. ఈ మూవీ టీజర్‌ విడుదల సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ, 'తమ జీవితాలని హృద్యంగా సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరపై మలిచారని , ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంద'ని అన్నారు.

ఇవి కూడా చదవండి:

కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

SkyC Media01 Jun, 07:29 am
హీరో నిఖిల్ బర్త్ డే స్పెషల్ స్వయంభూ సినిమా పోస్టర్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుంచి సరికొత్త స్వయంభూ సినిమా పోస్టర్ ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి నుంచి ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాలలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. నిఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన ప్రాజెక్ట్ గా రూపొందుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలను పెంచేలా ప్రమోషన్ల ప్లాన్ ను సిద్ధం చేశారు. నేడు విడుదల చేసిన స్వయంభూ సినిమా పోస్టర్ లో నిఖిల్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు డార్క్ టోన్ బ్యాక్‌గ్రౌండ్ మరియు ప్రత్యేకమైన టైటిల్ స్టైల్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దీంతో ఈ కొత్త లుక్ చూసిన ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓవరాల్ గా మాస్ మరియు మిస్టరీ వైబ్ ను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిత్ర బృందం ప్రమోషన్లను చాలా గట్టిగా మరియు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఫలితంగా రాబోయే రోజుల్లో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ స్వయంభూ సినిమా పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ల తదుపరి అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో

Chitrajyothy30 May, 10:51 am
ఛాంబర్ నిర్ణయానికి ఉషాపిక్చర్స్ తూట్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'పెద్ది' (Peddi) సినిమా జూన్ 4న జనం ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని ఓ పక్క నిర్మాతలు పథక రచన చేస్తుంటే... మరో పక్క ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కారణంగా ఎగ్జిబిటర్స్ ఆందోళనకు గురి అవుతున్నారు.

'పెద్ది' సినిమా కృష్ణాజిల్లా పంపిణీ హక్కులను ఉషా పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రదర్శించాలని ఉబలాటపడుతున్న ఎగ్జిబిటర్స్ ఆశలపై ఉషా పిక్చర్స్ సంస్థ నీళ్ళను గుమ్మరిస్తుందని ప్రదర్శనదారులు వాపోతున్నారు. అలవి గాని నిబంధనలను పెట్టడమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సూచనలను సైతం పాటించకుండా ఉషా పిక్చర్స్ సంస్థ ఒంటెద్దు పోకడలు పోతోందని ఎగ్జిబిటర్స్ ఆరోపిస్తున్నారు. 'పెద్ది' సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది. జూన్ 3వ తేదీ రాత్రి 8.00 గంటలకు ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి. దీని టిక్కెట్ ధరను రూ.600 లు గా నిర్ణయించారు. అలానే జూన్ 4 నుండి పది రోజుల పాటు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 125, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 టిక్కెట్ ధరను పెంచుకునే వెసులు బాటు కల్పించింది.

అయితే పెంచిన టిక్కెట్ ధరలో 7.5 శాతాన్ని ఎగ్జిబిటర్కు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. కానీ ఎగ్జిబిటర్స్ కు ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ఉషా పిక్చర్స్ సంస్థ నిరాకరిస్తోందట. అంతే కాకుండా 'పెద్ది' సినిమా ప్రదర్శించాలంటే తమతో రాత పూర్వకమైన ఒప్పందం చేసుకోవాలని, పాత బకాయిలన్నీ చెల్లించాలని, అదనపు షోస్ ప్రదర్శించే హక్కు ఎగ్జిబిటర్స్ కు ఉండదని, ముందస్తుగా తమ

Chitrajyothy30 May, 11:03 am
సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం

లీకైన రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ‘వారణాసి’ ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్.. ఢిల్లీ హైకోర్టులో నాగచైతన్య బిగ్ విన్.. విజయ్ దేవరకొండ, విక్రమ్ కె. కుమార్ కాంబోలో మూవీ, ముంబైలో చర్చలు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై సినీ నటుడు హీరో సుమన్ ప్రశంసలు.. యంగ్ హీరో అనీశ్, అనశ్వర రాజన్ కాంబో మూవీ ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్.. వంటి ఎన్నో అప్డేట్స్ కోసం పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండిక!

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Chitrajyothy25 May, 12:08 pm
Home » Tollywood » Nikhil Thomas Wraps First Schedule of Bengaluru Mahanagaram Lo Balaka ABN , Publish Date...

Home » Tollywood » Nikhil Thomas Wraps First Schedule of Bengaluru Mahanagaram Lo Balaka ABN , Publish Date - May 25 , 2026 | 05:38 PM నివేదా థామస్‌ తమ్ముడు నిఖిల్ థామస్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'బెంగళూరు మహానగరంలో బా...

Chitrajyothy24 May, 05:42 am
20 యేళ్ళ తర్వాత ఎఫ్.డి.సి.కి జవసత్వాలు! | Chandrababu Naidu Appoints Chairman and Film Industry Directors Onava

- Home » Miscellaneous » Chandrababu Naidu Appoints Chairman and Film Industry Directors Onava ABN , Publish Date - May 24 , 2026 | 11:12 AM ఎ.పి.ఎఫ్‌.డి.సి.కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో జవసత్వాలు నింపే ప... - ఛైర్మన్ ను నియమించి ఊరుకోకుండా సినిమా రంగానికే చెందిన డైరెక్టర్లను నియమించారు. - సినిమా రంగానికి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.

Chitrajyothy24 May, 03:43 am
డిస్ట్రిబ్యూటర్‌, ప్రొడ్యూసర్‌ బి. హరి హఠాన్మరణం | Distributor Dubbing Film Producer B Hari Passes Away Onava

- Home » Miscellaneous » Distributor Dubbing Film Producer B Hari Passes Away Onava ABN , Publish Date - May 24 , 2026 | 09:13 AM నెల్లూరుకు చెందిన ప్రముఖ పంపిణీదారుడు, డబ్బింగ్‌ చిత్రాల నిర్మాత బి. - హరి హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. - తెలుగు సినిమా రంగంలో విషాదం చోటు చేసుకుంది.

Chitrajyothy26 May, 06:23 am
నటి ఆత్మహత్య ... సుప్రీమ్‌ జోక్యం! | Twisha Sharma Case Transferred to CBI for Fair Investigation Onava

'ముగ్గురు మొనగాళ్ళు' ఫేమ్‌ త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్‌లో సూసైడ్ చేసుకుంది. నిందితులు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కావడంతో నిష్పక్షపాత దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కేసును సీబీఐకు అప్పగించింది. తెలుగులో దీక్షిత్‌ శెట్టి (Deekshith Shetty) సరసన 'ముగ్గురు మొనగాళ్ళు' (Mugguru Monagallu) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్విశా శర్మ ఈ నెల 12న భోపాల్ లో అత్తవారింట ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. మోడలింగ్‌ నుండి సినిమాల్లోకి వచ్చిన త్విశా శర్మ (Twisha Sharma) ఐదు నెలల క్రితం న్యాయవాది సమర్థ్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది. అయితే ఊహించని విధంగా ఆమె సూసైడ్‌ చేసుకోవడం అందరినీ కలచివేసింది. ఆర్థికపరమైన ఒత్తిడులు, వరకట్న వేదింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పుట్టింటి వారు ఆరోపిస్తే, ఆమెకు మాదక ద్రవ్యాల అలవాటు ఉందని అత్తింటి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్విశా శర్మ కేసును మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఇదిలా ఉంటే... మృతురాలి అత్త గిరిబాల సింగ్‌ మాజీ న్యాయమూర్తి కావడంతో ఆమె ఈ కేసులో తన పరపతిని ఉపయోగిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ తరహా వార్తా కథనాలు సుప్రీమ్‌ కోర్టు (Supreme Court) దృష్టికి రావడంతో శనివారం దీనిని సుమోటోగా స్వీకరించింది. సోమవారం ఈ కేసు సుప్రీమ్‌ కోర్టు ప్రధాన నాయ్యమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ పైకి వచ్చింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని, రెండోసారి పోస్ట్ మార్టమ్‌ను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్) వైద్యుల బృందం భోపాల్‌కు వెళ్ళి నిర్వహించిందని, ఆ ఫలితాలు