translateexpand_more

Uttar Pradesh News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 01:22 am
రూ. 2 లక్షల బ్యాగ్ తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఓ కోతి లాక్కెళ్లి, చెట్టుపైకి ఎక్కి నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.అస‌లేం జ‌రిగిందంటే..!కచేరీ రోడ్డులోని స్టాంప్ వెండర్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ లాయర్ తన సహోద్యోగి రవీంద్ర లోధి (రాజు)ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం స్టాంపులు కొనేందుకు పంపించారు. రాజు డబ్బుల బ్యాగ్‌తో వెళ్తుండగా, ఓ కోతి అకస్మాత్తుగా ఆ బ్యాగ్‌ను లాక్కొని సమీపంలోని వేప చెట్టుపైకి ఎక్కింది.చెట్టు కొమ్మపై కూర్చున్న కోతి, బ్యాగ్‌ను చించి అందులో ఉన్న రూ. 500 నోట్ల కట్టలను కిందకు విసిరేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ 'డబ్బుల వర్షం' కురుస్తున్నట్టు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన జనం, కింద పడుతున్న నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.సమాచారం అందుకున్న స్థానిక లాయర్లు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దాదాపు రూ. 1.91 లక్షల నగదును తిరిగి స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో పెద్దగా నష్టం జరగలేదని సమాచారం. కోతి కాసేపటికి ఖాళీ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆహారం కోసమే కోతి బ్యాగ్‌ను లాక్కెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద సాధారణమే కాగా, ఈ సంఘటన పట్టణ

Sakshi29 May, 04:00 am
ఈదురుగాలులకు కూలిన బ్రిడ్జి.. ఆరుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. హమీర్‌పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్‌లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు (ఫోటోలు) అధికారంతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే

Andhra Jyothy29 May, 02:45 am
ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఐదుగురి మృతి

ఉత్తర్ ప్రదేశ్‌ హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌: హమీర్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాను కారణంగా బెత్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఐదుగురు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కందౌర్-మొరకందర్ వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతుండగా బలమైన గాలులు వీచాయి. గాలుల ధాటికి వంతెన స్లాబ్, పిల్లర్లతో పాటు స్కాఫోల్డింగ్ నిర్మాణం కూలిపోయింది. దీంతో దాని కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు మృతిచెందినట్లు స్థానిక అధికారులు నిర్ధారించగా.. చాలా మంది కార్మికులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాలను తొలగిస్తూ కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..

Sakshi28 May, 11:48 am
యోగి ఆదిత్యనాథ్ కు అఖిలేశ్ కౌంట ర్

లక్నో: ఉత్తరప్రదేశ్ శాస‌నస‌భ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. అధికార బీజేపీ, విప‌క్ష స‌మాజ్‌వాదీ పార్టీల మ‌ధ్య వాగ్యుద్ధం న‌డుస్తోంది. ఎన్‌కౌంట‌ర్లపై ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన “యమరాజ్” వ్యాఖ్యలతో ఈ వివాదం మొద‌లైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంట‌ర్లు చేయింస్తోంద‌ని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ముదిరింది. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో వాగ్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఉత్తరప్రదేశ్‌లో కులం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా బీజేపీ ప్ర‌భుత్వం ఎన్‌కౌంటర్లు చేయిస్తోంద‌ని అఖిలేశ్ యాద‌వ్ ఆరోపించారు. వీటిలో కొన్ని నకిలీ ఎన్‌కౌంటర్లు కూడా ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు కొన్ని వ‌ర్గాల‌ను ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసింద‌న్నారు. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తుగా సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగ నేత పంకజ్ రాజ్‌భర్.. లక్నోలోని పార్టీ కార్యాలయం బయట ఓ భారీ పోస్ట‌ర్‌ను ఏర్పాటు చేశారు. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హత్యకు గురైన రాజ్‌భర్ కులానికి చెందిన వారి ఫొటోలు ఇందులో ముద్రించారు. వారణాసి, ఘాజీపూర్, జౌన్‌పూర్, బరాబంకీ, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, మౌ, బల్లియా జిల్లాల్లో హ‌త్య‌కు గురైన వారి వివ‌రాలు ఇందులో పేర్కొన్నారు. ఈ పోస్టర్ రాజకీయంగా యూపీలో తీవ్ర దుమారం రేపింది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే స‌మాజ్‌వాదీ పార్టీ త‌న కార్యాల‌యం ఎదుట‌ ఈ పోస్ట‌ర్ పెట్టింద‌ని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ఎన్‌కౌంట‌ర్ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. పోస్ట‌ర్‌లో పేర్కొన్న పలువురిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేర

Sakshi27 May, 02:44 am
యూపీలో ముందస్తు ముచ్చట

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. 2027లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే కొన్ని వారాల ముందే జరిగే అవకాశం ఉందా? ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన ఎన్నికలను డిసెంబర్ 2026 నుండి జనవరి 2027 మధ్య కాలంలో పూర్తి చేసే యోచనలో ఉన్నారా? అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ, రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన అడ్డంకి: జనగణన షెడ్యూల్ ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం 2027 ఫిబ్రవరిలో జరగబోయే దేశవ్యాప్త జనగణన రెండో దశ. ఈ ప్రక్రియలో వాస్తవ జనాభా గణన కోసం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం అవసరం. ఎన్నికల నిర్వహణకు కూడా ఇదే యంత్రాంగం కీలకం. రెండూ ఒకే సమయంలో జరగడం పరిపాలనా పరంగా అసాధ్యం కావడంతో, ఎన్నికలను ముందుగానే నిర్వహించే అంశంపై చర్చ మొదలైంది. చరిత్రక సరళి.. సవాళ్లు గత మూడు ఎన్నికలను గమనిస్తే (2012, 2017, 2022), ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ఎప్పుడూ ఫిబ్రవరి-మార్చి మధ్యే జరిగింది. ఇదే కాలపరిమితిని 2027లో పాటిస్తే, జనగణనతో ఖచ్చితంగా ఘర్షణ ఏర్పడుతుంది. కేవలం యూపీ మాత్రమే కాదు, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కూడా అదే సమయంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, జనవరి 2027 లోపే ప్రక్రియను ముగించేలా ఎన్నికల సంఘం యోచించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధత.. గడువు చట్టపరంగా చూస్తే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 15(2) ప్రకారం, అసెంబ్లీ గడువు తీరడానికి ఆరు నెలల ముందు నుండే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే వెసులుబాటు ఉంది. యూపీ అసెంబ్లీ గడువు మే 22, 2027తో ముగుస్తుంది. కాబట్టి, సాంకేతికంగా ఎన్నికల సంఘం నవంబర్ 2026

Sakshi24 May, 02:23 am
కాంగ్రెస్‌ చీఫ్‌పై కేసు నమోదు

- May 24 2026 7:17 AM | Updated on May 24 2026 7:17 AM లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ రాయ్‌పై కేసు నమోదైంది. - ఈ నెల 22వ తేదీన మహోబా జిల్లా సమద్‌ నగర్‌లో కాంగ్రెస్‌ నేత బ్రిజ్‌రాజ్‌ అహిర్వార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజయ్‌ రాయ్‌ పాల్గొన్నారు. - ఈ సందర్భంగా దాదాపు 16 వాహనాల్లో, 30 మంది అనుచరులతో ఆ కార్యక్రమానికి తరలివచ్చిన అజయ్‌ రాకపోకలకు అంతరాయం కలిగించారని, ప్రధాని మోదీని దూషించారని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నీరజ్‌ రావత్‌ అనే బీజేపీ కార్యకర్త కొట్వాలీ నగర్...

Andhra Jyothy26 May, 03:09 am
Home » National » Drunk Father attacked Son In Lakhimpur Kheri Uttar Pradesh suri ABN , Publish Date...

Home » National » Drunk Father attacked Son In Lakhimpur Kheri Uttar Pradesh suri ABN , Publish Date - May 26 , 2026 | 08:39 AM ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడ...

Indian Express24 May, 04:05 am
UP Madarsa Board Results Declared: 88.26% students pass, girls outshine boys

- Uttar Pradesh Madarsa Education Board declares 88.26% pass rate for secondary exams. - Overall pass rate is 88.07%, with girls performing better than boys. - Munshi/Maulvi (Secondary) examination has seen a significant increase in girls' performance, with 91.46% passing compared to 85.13% for boys. - Alim (Senior Secondary) examination also saw a notable improvement, with 7,822 girls achieving the pass rate of 90.88%, outperforming 6,540 boys at 86.42%.