translateexpand_more

Imd News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu29 May, 12:20 pm
రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్.. 10 నిమిషాల్లో సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. 5 లక్షల కోట్లు ఆవిరి

ఇక్కడ అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిందని చెబుతున్నా.. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా సంతకం చేయలేదని తెలిసింది. 60 రోజుల పాటు చర్చలు సాగుతాయని కూడా తెలుస్తోంది. ఇది యుద్ధం ముగింపుపై ఇంకా అనిశ్చితినే మిగిల్చింది. ఇటు డీల్ అంటూనే.. రెండు దేశాల మధ్య దాడులు జరుగుతుండటం కూడా అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్ని కల్పించింది. మరోవైపు.. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాలు కూడా కారణం అయ్యాయని తెలుస్తోంది. ఈసారి వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువగా 92 శాతమే రుతుపవనాల వర్షపాతం నమోదవుతుందని అంచనాల్ని వెలువరించింది. ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండటం వల్ల ఇది వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతోంది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయగా.. మార్కెట్ల భారీ పతనానికి అసలు కారణం ఇంకొకటి ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే MSCI రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (MSCI) ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లను ఇవాళ ఆఖర్లో పడేసిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు.. MSCI ఇండెక్స్‌ను ఫాలో అవుతుంటాయి. ఇక ప్రతి కొన్ని నెలలకు ఓసారి ఎంఎస్‌సీఐ తన ఇండెక్స్‌లో కంపెనీల్ని చేర్చడం, లేదా తొలగించడం, లేదా వాటి వెయిటేజీల్ని మార్చడం వంటివి చేస్తుంటుంది. దీనినే రీబ్యాలెన్సింగ్ లేదా రీజిగ్ అంటారు. ఈ మార్పులు.. ఇవాళ మార్కెట్ క్లోజింగ్ చివర్లో అమల్లోకి రావడంతో.. పాసివ్ ఫండ్స్ భారీ స్థాయిలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపాయి. దీంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రముఖ మార్కెట్ నిపుణులు నూరేష్ మెరానీ ప్రకారం చూస్తే.. ఈసారి భారత మార్కెట్‌పై ఆఖరి అరగంటలో దాదాపు 800 మిలియన్

10TV Telugu29 May, 08:27 am
నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక అప్డేట్.. కేరళను తాకేది ఆరోజే.. తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే

Southwest Monsoon : వేసవి ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడపాదడపా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నా.. ఎండ వేడిమి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చేస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తాజా వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. Also Read : Siddaramaiah : కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి ఐఎండీ అంచనా ప్రకారం.. మే 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడంతో జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అంచనా వేశారు. కానీ, నైరుతి రాక ఇంకాస్త ఆలస్యం అవుతుందని తాజాగా ఐఎండీ ప్రకటించింది. జూన్ 4, 5 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, కేరళను తాకిన రెండుమూడు రోజుల తరువాత ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గాలంటే మరో వారం పదిరోజుల పట్టే అవకాశం ఉంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ప్రారంభం నైరుతి రుతుపవనాల రాకపైనే ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు కూడా జోరుగా ముందుకు సాగుతాయి. దీంతో రైతులు రుతుపవనాల రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. గతేడాది అంచనా వేసిన సమయానికంటే

Samayam Telugu25 May, 12:35 pm
రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది....

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు.. గత పదేళ్లుగా రాష్...

Eenadu25 May, 11:02 am
హైదరాబాద్: ఎండల తీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని...

హైదరాబాద్: ఎండల తీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వ...

Asianet News Telugu28 May, 01:41 am
రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్

తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూల్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. మే 29 (శుక్రవారం) వరకు నగరానికి 'ఎల్లో అలర్ట్' జారీ చేస్తూ ఐఎండీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా భానుడు భగభగలాడుతూ చుక్కలు చూపించాడు. హైదరాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, మంగళవారం రాత్రి నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు సీన్ మార్చేశాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ఏరియాల్లో వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని సీఎం నొక్కి చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి సహా 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని

AP7AM31 May, 01:25 am
చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల తీవ్రత తగ్గి, వర్షాలు ప్రారంభం కానున్నాయి.ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు రానున్న నాలుగైదు రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి.రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో ఉపశమనం లభించనుంది. జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు, ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీలకు తగ్గుతాయని అంచనా. జూన్ 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడనున్నాయి. కాగా, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

AP7AM30 May, 04:30 pm
ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ

దేశంలో 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అంచనాలను విడుదల చేసింది. ఈ ఏడాది కేరళ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో 'సాధారణం కంటే తక్కువ' వర్షపాతం నమోదవుతుందని శనివారం వెల్లడించింది. దీనికి ఎల్ నినో ప్రభావమే ప్రధాన కారణమని, ఇది దాని విచిత్రమైన లక్షణమని ఐఎండీ డైరెక్టర్ నీతా కే గోపాల్ తెలిపారు.ఆమె మాట్లాడుతూ, "వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి రుతుపవనాల తీరు ఆశాజనకంగా లేదు. కేరళతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుంది" అని వివరించారు. ముఖ్యంగా కేరళలో జూన్ నెలలోనూ వర్షపాతం తక్కువగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. "రుతుపవనాల ఆగమనం తర్వాత, జూన్ 10 ప్రాంతంలో కొన్ని మంచి వర్షాలు పడవచ్చు. కానీ ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. దీంతో నెల మొత్తం మీద వర్షపాతం తక్కువగానే నమోదవుతుంది" అని నీతా గోపాల్ తెలిపారు. ఎల్ నినో సంవత్సరంలో వర్షపాతం ఇలాగే అస్థిరంగా ఉంటుందని, కొన్నిసార్లు మంచి వర్షాలు కురిసి, ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడుతుందని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్రమైన వేడి, ఉక్కపోత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. జూన్ 4 వరకు ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాతావరణంలో మార్పులు

Oneindia Telugu30 May, 01:18 pm
ఐఎండీ చల్లని కబురు-రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్

వేసవి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలు.. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనేక వాతావరణ అంచనాలు రుతుపవనాలు జూన్ 2-4 మధ్య వస్తాయని అంచనా వేశాయి. దీనికి అనుగుణంగానే జూన్ 3 కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకబోతున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) ఇవాళ వెల్లడించింది. గతంలో ఐఎండీ నైరుతి రుతుపవనాలు మే 26న ముందుగానే వస్తాయని అంచనా వేసినా ఆలస్యమైంది.AP Weather: రేపు, ఎల్లుండి వీళ్లకు ఎండలు-వాళ్లకు వర్షాలు..!మరోవైపు ఎల్ నినో ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. జూన్‌లో ఒక బలహీనమైన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, ఇది రుతుపవన కాలమంతా వర్షపాత సరళిని ప్రభావితం చేయగలదని ఐఎండీ చెబుతోంది. రుతుపవనాల రాకకు అవసరమైన పశ్చిమ గాలులు బలపడటాన్ని లక్షద్వీప్‌పై ఉన్న ఒక తుఫాను వలయం ప్రస్తుతం ప్రభావితం చేస్తోందని ఐఎండీ డైరెక్టర్ నీతా కె గోపాల్ తెలిపారు. అయితే, దీని అర్థం రుతుపవనాలు ఆలస్యం అయ్యాయని కాదని ఆమె అన్నారు. ఇది ఆలస్యమైన రుతుపవనాలని మనం ఇంకా చెప్పలేమని, సాధారణ సమయంలోనే వస్తుందని అంచనా అన్నారు. జూన్ 8 తర్వాత రుతుపవనాల రాక జరిగితేనే దానిని ఆలస్యం అయినట్లుగా పరిగణిస్తామన్నారు. AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..!వచ్చే నెల రోజుల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. బలహీనమైన పశ్చిమ గాలుల కారణంగా కేరళలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాల వంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నీతా తెలిపారు.ఇవి రుతుపవనాల పురోగతికి సంబంధించిన ముందస్తు పరిస్థితులు అన్నారు. తుఫాను వ్యవస్థ కదిలిన తర్వాత తీరప్రాంతంలో బలమైన పశ్చిమ గాలులు వీస్తాయని ఆశిస్తున్నట్లు

Oneindia Telugu01 Jun, 11:24 am
గంటల్లో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వేసవి తాపం, వడగాల్పులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ విభాగం ఇవాళ చల్లని వార్ల చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్ధితులు అనుకూలంగా మారుతుండటంతో భారీ వర్షాలు (heavy rains) పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు కురుస్తాయో కూడా వెల్లడించింది. అలాగే పలు జిల్లాలకు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తేలడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. ఇందులో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ఇక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తెలిపింది. కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం కోరుతోంది. మరో 48 గంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దక్షిణ కోస్తాలో వడగాలుల తీవ్రత కూడా తగ్గనుంది. దీని స్ధానంలో ఈదురు గాలులు మొదలవుతాయి. రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. రుతుపవనాలు వచ్చే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.