translateexpand_more

Southwest Monsoon News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu01 Jun, 12:05 pm
తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళం రాష్ట్రాన్ని తాకబోతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడే అవకాశం కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ గారు కీలక అప్‌డేట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అరబిక్ మహాసముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ

Andhra Jyothy31 May, 12:43 am
నాలుగైదు రోజుల్లో కేరళకు నైరుతి

నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో.. విశాఖపట్నం/అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో కేరళతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం కేరళ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో రెండు మూడు రోజుల్లో గాలుల దిశ మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలావుండగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. భూమధ్య రేఖ దాటి హిందూ మహా సముద్రంలోకి రుతుపవన మేఘాల రాక మొదలైంది. శనివారం నాటి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ, నాలుగైదు రోజుల్లో కేరళ, తమిళనాడుకు రుతుపవనాలు రానున్నాయని వెల్లడించింది. జూన్‌ మూడు లేదా నాలుగో తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం బాగా తగ్గింది. అక్కడక్కడా ఓ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. నంద్యాల జిల్లా సంజామలలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

TV9 Telugu31 May, 07:56 am
ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఓవైపు ఎండలు మరోవైపు... మరోవైపు వర్షాలు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితి. తెలంగాణను హీట్‌వేవ్ భయపెడుతుంటే.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరింది. ఇవాళ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కేరళ తీరానికి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో జూన్‌లో కూడా ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ నెలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం వల్ల వేడి వాతావరణం ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఒకవైపు రుతుపవనాల ఆగమనం, మరోవైపు హీట్‌వేవ్ పరిస్థితులు ఒకేసారి నెలకొనే విచిత్ర వాతావరణం కనిపించనుంది. జూన్ నెలలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండనుంది. అక్కడ సాధారణం కంటే 45% నుండి 55% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని అంచనా. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ - వాతావరణ హెచ్చరికలు : హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విదర్భ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర

10TV Telugu29 May, 03:13 am
తెలంగాణకు రెండ్రోజుల్లో రుతుపవనాలు.. నేడు, రేపు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. అలర్ట్ జారీ

Telangana Rains : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు రాబోతున్నాయని తెలిపింది. వచ్చే మూడురోజుల్లో వాతావరణం చల్లబడి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. Also Read : Mahalaxmi Smart Card : తెలంగాణలోని మహిళలకు బిగ్ అలర్ట్.. జూన్ 2నుంచి ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి.. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ప్రతీయేటా జూన్ 1నాటికి కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తరదిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు క్రమంగా రుతుపవనాలు చేరుకుంటాయి. కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించిన చోట వర్షాలు కురవడం మొదలవుతాయి. ఈ వర్షాల సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తరువాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. ప్రతీయేటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తరువాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ, ఈసారి ముందుగానే రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రుతుపవనాలు ప్రవేశించిన తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ద్రోణి కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి

Zee Telugu28 May, 03:31 pm
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..మరో 12 రోజుల్లో వానలే వానలు

Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే లక్షద్వీప్‌లోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లు పలకరించే అవకాశాలు కనిపస్తున్నాయి.

TV9 Telugu29 May, 01:45 am
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ, ఏపీలో వాతావరణం చల్లబడుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా ఒకట్రెండు రోజుల్లో ఎంటర్‌ కానుండటంతో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి వాన కుమ్మేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలు బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్‌ 3,4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్‌నకు చేరుకున్నాయని.. వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 5-10 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో వచ్చే మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని వివరించింది. ఇదిలాఉంటే.. ద్రోణి ప్రభావంతో శుక్రవారం మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇవాళ.. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ మిడిసిపడగా.. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో

10TV Telugu29 May, 08:27 am
నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక అప్డేట్.. కేరళను తాకేది ఆరోజే.. తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే

Southwest Monsoon : వేసవి ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడపాదడపా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నా.. ఎండ వేడిమి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చేస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తాజా వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. Also Read : Siddaramaiah : కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి ఐఎండీ అంచనా ప్రకారం.. మే 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. కానీ, ఆలస్యం కావడంతో జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అంచనా వేశారు. కానీ, నైరుతి రాక ఇంకాస్త ఆలస్యం అవుతుందని తాజాగా ఐఎండీ ప్రకటించింది. జూన్ 4, 5 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, కేరళను తాకిన రెండుమూడు రోజుల తరువాత ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గాలంటే మరో వారం పదిరోజుల పట్టే అవకాశం ఉంది. భారతదేశంలో పలు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ప్రారంభం నైరుతి రుతుపవనాల రాకపైనే ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు కూడా జోరుగా ముందుకు సాగుతాయి. దీంతో రైతులు రుతుపవనాల రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. గతేడాది అంచనా వేసిన సమయానికంటే

10TV Telugu26 May, 02:21 am
Telangana Weather : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా...

Telangana Weather : తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్ర వ్య...

Asianet News Telugu28 May, 11:12 am
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా

Monsoon Update : మండటెండలతో సతమతం అవుతున్న భారతీయులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. ఇప్పటికే వర్షాలు మొదలై వాతావరణం కాస్త చల్లబడింది... అయితే ఇకపై ఎండల తీవ్రత తగ్గి వర్షాలు పెరుగుతాయని ప్రకటించింది. రోహిణి కార్తె ఎండలకు గుడ్ బై చెబుతూ నైరుతు రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్నాయని... అంటే ఇక అసలుసిసలైన వర్షాకాలం ప్రారంభంకానుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనా వేసినట్లు నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలకు తాకనున్నాయి. ఇప్పటికే చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు లక్షద్వీప్ కు చేరుకున్నాయట... ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా, లక్షద్వీప్ బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇవి ఒకటి రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాయని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి... ఇవి ఇక ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రెండుమూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని... జూన్ లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, ఏపీలో వర్షాలు జోరందుకోగానే ఎండలు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం.. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు లేవట. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని... చెప్పాలంటే 2018 వర్షాకాల పరిస్థితులు రిపీట్ అవుతాయని తెలిపారు. గత నాలుగైదేళ్ల స్థాయిలో అయితే వర్షాలుండవని వెదర్ మ్యాన్ స్పష్టం చేశారు. లోటు వర్షపాతం అంటే 2014-15 సమయంలో మాదిరిగా మరీ కరవు పరిస్థితులు ఉండవని.. ప్రజలు

AP7AM31 May, 01:25 am
చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల తీవ్రత తగ్గి, వర్షాలు ప్రారంభం కానున్నాయి.ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు రానున్న నాలుగైదు రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు తెలిపారు. లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి.రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా దేహాగాన్‌లో రికార్డు స్థాయిలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, రానున్న రోజుల్లో ఉపశమనం లభించనుంది. జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 36-38 డిగ్రీలకు, ఇతర జిల్లాల్లో 40-42 డిగ్రీలకు తగ్గుతాయని అంచనా. జూన్ 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడనున్నాయి. కాగా, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

AP7AM30 May, 04:30 pm
ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ

దేశంలో 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అంచనాలను విడుదల చేసింది. ఈ ఏడాది కేరళ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో 'సాధారణం కంటే తక్కువ' వర్షపాతం నమోదవుతుందని శనివారం వెల్లడించింది. దీనికి ఎల్ నినో ప్రభావమే ప్రధాన కారణమని, ఇది దాని విచిత్రమైన లక్షణమని ఐఎండీ డైరెక్టర్ నీతా కే గోపాల్ తెలిపారు.ఆమె మాట్లాడుతూ, "వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి రుతుపవనాల తీరు ఆశాజనకంగా లేదు. కేరళతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుంది" అని వివరించారు. ముఖ్యంగా కేరళలో జూన్ నెలలోనూ వర్షపాతం తక్కువగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. "రుతుపవనాల ఆగమనం తర్వాత, జూన్ 10 ప్రాంతంలో కొన్ని మంచి వర్షాలు పడవచ్చు. కానీ ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. దీంతో నెల మొత్తం మీద వర్షపాతం తక్కువగానే నమోదవుతుంది" అని నీతా గోపాల్ తెలిపారు. ఎల్ నినో సంవత్సరంలో వర్షపాతం ఇలాగే అస్థిరంగా ఉంటుందని, కొన్నిసార్లు మంచి వర్షాలు కురిసి, ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడుతుందని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్రమైన వేడి, ఉక్కపోత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. జూన్ 4 వరకు ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాతావరణంలో మార్పులు

Oneindia Telugu30 May, 01:18 pm
ఐఎండీ చల్లని కబురు-రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్

వేసవి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలు.. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అనేక వాతావరణ అంచనాలు రుతుపవనాలు జూన్ 2-4 మధ్య వస్తాయని అంచనా వేశాయి. దీనికి అనుగుణంగానే జూన్ 3 కల్లా కేరళను నైరుతి రుతుపవనాలు తాకబోతున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) ఇవాళ వెల్లడించింది. గతంలో ఐఎండీ నైరుతి రుతుపవనాలు మే 26న ముందుగానే వస్తాయని అంచనా వేసినా ఆలస్యమైంది.AP Weather: రేపు, ఎల్లుండి వీళ్లకు ఎండలు-వాళ్లకు వర్షాలు..!మరోవైపు ఎల్ నినో ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. జూన్‌లో ఒక బలహీనమైన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, ఇది రుతుపవన కాలమంతా వర్షపాత సరళిని ప్రభావితం చేయగలదని ఐఎండీ చెబుతోంది. రుతుపవనాల రాకకు అవసరమైన పశ్చిమ గాలులు బలపడటాన్ని లక్షద్వీప్‌పై ఉన్న ఒక తుఫాను వలయం ప్రస్తుతం ప్రభావితం చేస్తోందని ఐఎండీ డైరెక్టర్ నీతా కె గోపాల్ తెలిపారు. అయితే, దీని అర్థం రుతుపవనాలు ఆలస్యం అయ్యాయని కాదని ఆమె అన్నారు. ఇది ఆలస్యమైన రుతుపవనాలని మనం ఇంకా చెప్పలేమని, సాధారణ సమయంలోనే వస్తుందని అంచనా అన్నారు. జూన్ 8 తర్వాత రుతుపవనాల రాక జరిగితేనే దానిని ఆలస్యం అయినట్లుగా పరిగణిస్తామన్నారు. AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..!వచ్చే నెల రోజుల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. బలహీనమైన పశ్చిమ గాలుల కారణంగా కేరళలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాల వంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నీతా తెలిపారు.ఇవి రుతుపవనాల పురోగతికి సంబంధించిన ముందస్తు పరిస్థితులు అన్నారు. తుఫాను వ్యవస్థ కదిలిన తర్వాత తీరప్రాంతంలో బలమైన పశ్చిమ గాలులు వీస్తాయని ఆశిస్తున్నట్లు

Samayam Telugu29 May, 09:36 am
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్ డేట్.. రైతాంగానికి ఈసారి నిరాశే

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు.. గత పదేళ్లుగా రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథనాలు, విశ్లేషణల రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. సోషల్ మీడియా పోస్టులను జీవీఎన్ అప్పారావు ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీకి సంబంధించిన కథనాలు రాసిన అనుభవం ఉంది. జీవీఎన్ అప్పారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు సంస్థలో ఐదేళ్లకుపైగా పని చేశారు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Oneindia Telugu01 Jun, 11:24 am
గంటల్లో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వేసవి తాపం, వడగాల్పులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ విభాగం ఇవాళ చల్లని వార్ల చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్ధితులు అనుకూలంగా మారుతుండటంతో భారీ వర్షాలు (heavy rains) పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు కురుస్తాయో కూడా వెల్లడించింది. అలాగే పలు జిల్లాలకు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తేలడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. ఇందులో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ఇక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తెలిపింది. కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం కోరుతోంది. మరో 48 గంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దక్షిణ కోస్తాలో వడగాలుల తీవ్రత కూడా తగ్గనుంది. దీని స్ధానంలో ఈదురు గాలులు మొదలవుతాయి. రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. రుతుపవనాలు వచ్చే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.