
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళం రాష్ట్రాన్ని తాకబోతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడే అవకాశం కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ గారు కీలక అప్‌డేట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అరబిక్ మహాసముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ
